హైడ్రోజన్ బాంబు ఎఫెక్ట్: ఎత్తు తగ్గిన మంటస్ పర్వతం

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా ఇటీవల మంటస్ పర్వత శ్రేణుల్లో చేసిన భూగర్భ అణుపరీక్షల కారణంగా 85 ఎకరాల మేర భూమి ప్రభావితమైందని ఎయిర్‌బస్ సింథటిక్ అపెర్చర్ రాడార్ శాటిలైల్ చిత్రాల ఆధారంగా తెలుస్తోంది.

ఈ శాటిలైట్ పంపిన చిత్రాలను బ‌ట్టి చూస్తే మంట‌ప్ ప‌ర్వ‌తం ఎత్తులో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తుంది. దీన్ని బ‌ట్టి ఉత్త‌ర కొరియా క‌చ్చితంగా అత్యంత తీవ్ర‌త గ‌ల‌ హైడ్రోజ‌న్ బాంబును ప‌రీక్షించి ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

 Before and after images of North Korea’s nuclear test show change in height of mountain
  North Korea Vs Japan చుక్కలు చూపిస్తున్న కిమ్ జపాన్ పై మళ్లీ క్షిపణి ప్రయోగం | Oneindia Telugu

  అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇదే ప్రాంతంలో అణుప‌రీక్ష‌లు జ‌రుపుతున్న కార‌ణంగా కూడా ప‌ర్వ‌త భౌతిక స్థితిలో మార్పు వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఉత్త‌ర కొరియా జ‌రిపిన 6 అణుప‌రీక్ష‌ల్లో 5 ప‌రీక్ష‌ల‌ను ఈ ప‌ర్వ‌త ప్రాంతంలో ఉన్న పంగ్యే-రీ వ‌ద్ద‌నే ప‌రీక్షించారు.

  అందులోనూ సెప్టెంబ‌ర్ 3న జ‌రిపిన అణుప‌రీక్ష తీవ్ర‌త మిగిలిన 4 అణుప‌రీక్ష‌ల కంటే ఎక్కువగా ఉండ‌టంతో ప‌ర్వ‌త భౌగోళిక ప‌రిమాణం మీద తీవ్ర ప్ర‌భావం ప‌డి ఉండ‌వ‌చ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

  ప్రపంచంలో భూగ‌ర్భ అణు ప‌రీక్ష విధానాల‌ను ఇంకా ఉప‌యోగిస్తున్న ఏకైక దేశం ఉత్త‌ర కొరియా. ఇలా ప‌రీక్ష‌లు కొన‌సాగుతూ పోతే చాలా ప్ర‌మాద‌ముంటుంద‌న్నారు. ఇదే విధంగా అణు పరీక్షలు నిర్వహిస్తే తీవ్రంగా భూకంపాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుందని సెంట‌ర్ ఫ‌ర్ నాన్‌ప్రొలిఫిరేష‌న్ స్ట‌డీస్ అధ్యాప‌కులు చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Images showed that the nuclear test conducted by North Korea, which it claims was an Hydrogen Bomb, was powerful enough to sink an 85-acre area on the mountain under which it was likely detonated earlier in September.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి