వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాబ్‌కంటే భిక్షాటనతో ఎక్కువ డబ్బు:కోర్టులో బిచ్చగాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: తాను ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బుల కంటే బిచ్చం ఎత్తుకుంటేనే ఎక్కువగా వస్తుందని, తాను డబ్బులు సంపాదించేది తన కొరకు కాదని, తన పిల్లల కొరకు అని క్రెయిగ్ అట్కిన్‌సన్ అనే వ్యక్తి న్యాయస్థానంలో చెప్పాడు. ఈ సంఘటన ఇంగ్లాండులోని నాటింగ్‌హాంలో జరిగింది.

తాను ఉద్యోగం చేస్తే, తద్వారా వచ్చే ఆదాయంతో తన పిల్లలను పోషించలేకపోతున్నానని, బిచ్చం ఎత్తుకుంటే మాత్రం కుటుంబాన్ని పోషించకగలుగుతున్నానని చెప్పాడు. క్రెయిగ్ బిచ్చం ఎత్తుకుంటూ తన పిల్లలను చదివించుకుంటున్నాడు.

ఓసారి అతను అతను బిచ్చం ఎత్తుకుంటుండగా పోలీసులు అరెస్టు చేశారు. అతనిని న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టారు. అప్పుడు న్యాయమూర్తి అతనితో ఉద్యోగం చేసుకోవచ్చుగా అని సూచించారు.

 Beggar tells court he earns more from street than working a real job

దానికి క్రెయిగ్ మాట్లాడుతూ... ఉద్యోగం చేస్తే నా కుటుంబాన్ని పోషించుకోలేనని, బిచ్చమెత్తుకుంటేనే తగినంత ఆదాయం వస్తోందని, పిల్లల్ని చదివించుకోగలనని, నేను అడుక్కోవడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం కానీ కష్టం కానీ కలగడం లేదని, తనకు డ్రగ్స్‌ లాంటి అలవాట్లు లేవని, తన సంపాదన అంతా పిల్లలకే ఖర్చుపెడుతున్నానని వివరించాడు.

భిక్షాటన మానేసి ఉద్యోగం చేయాలని షరతులతో కూడిన ఆర్నెల్ల గడువు విధిస్తూ జడ్జి అతనికి పదిహేను పౌండ్ల జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని క్రెయిగ్ అప్పటికి అప్పుడు కట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరో 85 పౌండ్ల ప్రాసిక్యూషన్‌ ఛార్జీలు కూడా చెల్లించమనే సరికి అది మాత్రం తాను చెల్లించలేనని, జైలుకే పంపమని చెప్పాడు.

English summary
Beggar tells court he earns more from street than working a real job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X