వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్: చైనా దొంగ పని - అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ - మాస్క్‌పైనా సంచలన నిర్ణయం

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి దెబ్బకు దేశదేశాలు అల్లాడుతుండగా.. వైరస్ పుట్టినిల్లు చైనాలో మాత్రం భిన్న వాతావరణం నెలకొంది. ప్రపంచం మొత్తానికి వైరస్ అంటించిన చైనీయులు.. తాము మాత్రం వేడుకల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే చైనీస్ ఆరోగ్య శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని బీజింగ్ నగరంలో ప్రజలెవరూ ఇకపై ఫేస్ మాస్కులు వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మరోవైపు, కొవిడ్-19 వ్యాక్సిన్ పై చైనా అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.

కరోనా వేళ షాకింగ్ బిజినెస్ - వాడి పారేసిన గ్లవ్స్ మళ్లీ అమ్మకం - ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసా?కరోనా వేళ షాకింగ్ బిజినెస్ - వాడి పారేసిన గ్లవ్స్ మళ్లీ అమ్మకం - ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసా?

13 రోజులుగా కేసులు నిల్

13 రోజులుగా కేసులు నిల్

చైనా రాజధాని బీజింగ్ సహా శివారు ప్రాంతాల్లో గడిచిన 13 రోజులుగా కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, వైరస్ వ్యాప్తిని దాదాపుగా అరికట్టగలిగామని, అందుకే బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి కాదనే ఉత్తర్వులు ఇచ్చామని అధికారులు చెప్పారు. వాస్తవానికి ఏప్రిల్ చివరి వారంలోనే మాస్కుల ధారణపై బీజింగ్ లోని కరోనా కంట్రోల్ సెంటర్లు మినహాయింపులిచ్చాయి. అయితే, తర్వాతి కాలంలో మళ్లీ కేసులు తిరగబెట్టడంతో ఉత్తర్వులు వెనక్కి తీసకున్నారు. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్ లో ఉందని, టెస్టింగ్, ట్రేసింగ్, డిస్టెన్సింగ్, హోం క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్లే ఈ ఘనత సాధించామని అధికారులు చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

వూహాన్ లో సంబురాలు..

వూహాన్ లో సంబురాలు..

బీజింగ్ సిటీలో ఇకపై మాస్కులు ధరించాల్సిన పనిలేదని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. కొంత మంది సేఫ్టీ పాటిస్తూనే ఉన్నారు. మాస్క్ లేకుండా బయటికి వెళితే అవతలివాళ్లు రిసీవ్ చేసుకుంటారో లేదో అనుమానంగా ఉందని, ప్రజల్లో ఇంకా భయాందోళనలు తగ్గలేదని బీజింగ్ వాసులు చెబుతున్నారు. ఇక, వైరస్ పుట్టినిల్లు వూహాన్ సిటీలో మాత్రం ఆంక్షలన్నీ తొలగిపోయిన వేళ ప్రజలు సంబురాల్లో మునిగితేలుతున్నారు. వూహాన్ సిటీలోని పార్కులు, పబ్లిక్ ప్లేసులను రీ ఓపెన్ చేసిన ప్రభుత్వం.. ఎంట్రీ టికెట్ రద్దు చేసి, ఉచిత అవకాశం కల్పించడంతో జనం భారీగా వెళుతున్నారు. వూహాన్ వాసులు మాస్కులు లేకుండా పార్టీలు చేసుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే..

మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంట్లో విషాదం - కరోనా నుంచి కోలుకున్న కొద్ది గంటకే తల్లి మృతి..మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంట్లో విషాదం - కరోనా నుంచి కోలుకున్న కొద్ది గంటకే తల్లి మృతి..

అక్రమంగా వ్యాక్సిన్ ట్రయల్స్?

అక్రమంగా వ్యాక్సిన్ ట్రయల్స్?

కరోనాకు సంబంధించిన అన్ని నిజాలను దాచిపెట్టి ఇతర దేశాల కొపలు ముంచిన చైనా.. ఇప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ విషయంలోనూ అదే విధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా దేశాలన్నీ తాము అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ల గురించి క్రమం తప్పకుండా వివరాలు అందిస్తూ, క్లినికల్ ట్రయల్స్ పురోగతిని కూడా వెల్లడిస్తూ వస్తుండగా, చైనా మాత్రం అతి రహస్యంగా ట్రయల్స్ నిర్వహించడమే కాకుండా.. డోసు తీసుకున్న వాలంటీర్లలో ఎలాంటి మార్పులు వచ్చాయనే పరిశీలన చేయకుండానే విచ్చలవిడిగా వదిలేసిన వైనం బయటపడింది.

Recommended Video

China's Sinopharm Covid-19 Vaccine To Be aAvailable At End Of 2020 || Oneindia Telugu
చైనీస్‌ను నిషేధించిన పీఎన్‌జీ..

చైనీస్‌ను నిషేధించిన పీఎన్‌జీ..

పసిఫిక్ సముద్రంలో, ఆస్ట్రేలియాకు సమీపంగా ఉండే ద్వీపదేశం పపువా న్యూ గినియా(పీఎన్‌జీ) శుక్రవారం నుంచి చైనీస్ రాకపోకలపై నిషేధం విధించింది. గినియా కరోనా కంట్రోల్ అధికారుల వివరణ ప్రకారం.. ఆ దేశంలోని గనుల్లో పనిచేసేందుకు చైనా నుంచి 48 మంది కార్మికులు(మైనర్లు) విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టులో టెస్టులు చేయబోగా.. తామంతా కొవిడ్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నామని, కరోనా బారినపడే అవకాశమే లేదని కార్మికులు చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. ఆ కార్మికులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు? ఎన్ని రోజుల క్రితం వేసుకున్నారు? దాని ఎఫెక్ట్ ఎలా ఉంటంది? అని గినియా అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ చైనా నుంచి బదులు రాలేదు. దీంతో వాళ్లను విమానాశ్రం నుంచే వెనక్కి పంపేసి, చైనీస్ రాకపోకలపై నిషేధం విధించారు. దేశ ప్రజల భద్రత విషయంలో రాజీ పడబోమని, చైనా తన క్లినికల్ ట్రియల్స్ వివరాలు చెప్పేదాకా నిషేధం కొనసాగుతుందని గినియా అధికారులు పేర్కొన్నారు.

English summary
People in China's capital Beijing are no longer required to wear masks outdoors, health authorities said on Friday. Papua New Guinea prevented the arrival of a flight carrying Chinese workers, demands China explain COVID-19 vaccine trial on miners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X