సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజల ఓటు, 22రాష్ట్రాలు..
యూకే: స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణలో సమైక్యవాదానికే మద్దతు లభించింది. స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు. కౌంటింగ్‌లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది.
సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే, వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు వేశారు. దీంతో, 300 ఏళ్ల బ్రిటన్-స్కాట్లాండ్ అనుబంధం యథావిధిగా ఇకపై కూడా కొనసాగనుంది. మొత్తం 43 లక్షల మంది ప్రజలు ఓటింగులో పాల్గొన్నారు.

1707 నుంచి గ్రేట్ బ్రిటన్ పాలనలో స్కాట్లాండ్ ఉంది. స్కాట్లాండులో మొత్తం 32 రాష్ట్రాలు ఉండగా ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు విభజనను వ్యతిరేకించాయి. కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే విభజనకు విభజనకు మద్దతును ఇచ్చాయి. స్కాట్లాండుకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న విభజనవాదులకు ప్రజాభిప్రాయ సేకరణలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.












Click it and Unblock the Notifications