కాస్త దూరం ఉండండి!: స్మార్ట్ ఫోన్‌తో కొంచెం జాగ్రత్త
బెర్లిన్: స్మార్ట్ ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గుండెలో పేస్ మేకర్ కలిగి ఉన్న వ్యక్తులు లేదా రోగులు స్మార్ట్ ఫోన్ల నుంచి సురక్షిత దూరంలో ఉండాలని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్ల నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలను గుండె సంకేతంగా పేస్ మేకర్లు గుర్తించే అవకాశముందంటున్నారు.

తద్వారా గుండె స్పందనల్లో తేడా వచ్చి సదరు వ్యక్తులు స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పేస్ మేకర్లు తదితరాల నుండి సెల్ ఫోన్లను కనీసం ఇరవై సెంటీమీటర్ల దూరం వరకు ఉంచాలని సూచిస్తున్నారు.
పేస్ మేకర్లు, తదితరాలు అమర్చిన 308 మంది వ్యక్తుల పైన జర్మనీ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. వీరిలో ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలకు ప్రభావితం కావడాన్ని గుర్తించారు. గతంలోను పలు సంస్థలు ఈ విషయం వెల్లడించాయి.












Click it and Unblock the Notifications