చంద్రబాబును డిన్నర్‌కు పిల్చిన బిల్‌గేట్స్, మళ్లీ సీఎం అయ్యారని తెలిసి..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ విందుకు ఆహ్వానించారు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం నాడు బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఏపీకి సహకరించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలన్నారు. చంద్రబాబుతో భేటీ కావడం పైన బిల్ గేట్స్ ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారని తెలిసి సంతోషించానని చెప్పారు. బాబును అభినందించారు. అనంతరం చంద్రబాబును రాత్రి విందుకు ఆహ్వానించారు.

కాగా, చంద్రబాబు, బిల్ గేట్స్ పదేళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత కలిశామంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. చంద్రబాబు రెండు రోజులుగా దావోస్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పోరేట్ అధినేతలతో సమావేశమవుతున్న విషయం తెలిసిందే.

Bill Gates invites Chandrababu Naidu for dinner

ఏపీలో పరిశ్రమలు స్థాపించే వారికి ఇతోధికంగా ప్రోత్సాహమందిస్తామని చంద్రబాబు గురువారం నాడు పట్టణాభివృద్ధి సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆయన పలువురితో భేటీ అయ్యారు. రాయల్‌ ఫిలిప్స్‌ సీఈవో ఫ్రాన్స్‌ వ్యాన్‌ హటన్‌, మహేంద్ర అండ్‌ మహేంద్ర ప్రతినిధి అనీష్‌ షాతో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు.

లులు ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ ఎండీ యూసుఫ్‌ అలీ, సంస్థ ప్రతినిధులు షంషేర్‌ వేయల్లి, ఆదీబ్‌ అహ్మద్‌లతో, ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కాతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమంటూ జీఏసీ ఇండియా, భారత్‌ ఫోర్జ్‌ తదితర కంపెనీలు చంద్రబాబుకు హామీ ఇచ్చాయి.

రక్షణ, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఆటోమోబైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తాము సుముఖంగా ఉన్నామని ఆయా కంపెనీల ప్రతినిధులు వివరించారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాలని, ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు స్వర్గధామమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో లభించే సహజ వనరులు, భౌగోళిక స్థితిగతులు, వ్యవసాయోత్పత్తుల గురించి మార్కెటింగ్‌ చేయడంతోపాటు పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను సావధానంగా వివరించారు. భారత్‌ ఫోర్జ్‌ చైర్మన్‌ బాబా ఎన్‌ కల్యాణి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమిత్‌ కల్యాణితో చంద్రబాబు భేటీ అయ్యారు. రక్షణ రంగంలో సాంకేతిక నైపుణ్యాలపై ప్రధానంగా మిస్సైల్‌ రంగంలో పెట్టుబడులపై వారితో చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+