వైరల్ వీడియో: 'ఇది విరాట్'.. 'సాయం కావాలి'.. 'మేడే'..
రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నల్ల సముద్రంలో రష్యాకు చెందిన రెండు ట్యాంకర్లపై దాడి జరిగింది. ఇది ఓ డ్రోన్ ఎటాక్ అని.. తమకు సాయం కావాలని సిబ్బంది రేడియో ద్వారా సాయం కోరింది. అయితే ఈ దాడులకు పాల్పడింది తామేనని ఉక్రెయిన్ తాజాగా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
నల్లసముద్రంలో ఘోరమైన డ్రోన్ ఎటాక్ జరిగింది. రష్యాకు చెందిన విరాట్, కైరోస్ అనే రెండు ఆయిల్ ట్యాంకర్లపై డ్రోన్ దాడి జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగనట్లు స్పష్టం అవుతోంది. అయితే దాడి జరిగిన తర్వాత రెండు ట్యాంకర్లలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ కైరోస్ ట్యాంకర్ మునిగిపోయే ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. విరాట్ ట్యాంకర్ ను 2018 లో నిర్మించారు. కైరోస్ ట్యాంకర్ ను 2022 లో నిర్మించినట్లు సమాచారం.
Reportedly, this is a sea drone attack on Russian shadow fleet tankers yesterday.
— Anton Gerashchenko (@Gerashchenko_en) November 29, 2025
The tankers were empty, headed to Russian Novorossiysk. pic.twitter.com/d5M82Rg6yZ
ది విరాట్ ట్యాంకర్ ను డ్రోన్ లు దాడి చేశాయి. నల్ల సముద్రం కోస్ట్ లైన్ నుంచి 35 నాటికల్ మైల్స్ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అని టర్కీ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఓ పోస్టులో తెలిపింది. ఈ మేరకు దాడి జరిగిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సిబ్బంది మాట్లాడుతూ.. డ్రోన్ ఎటాక్, సాయం కావాలి.. దిస్ ఈజ్ విరాట్.. సాయం కావాలి.. మేడే అన్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఉక్రెయిన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీక్రెట్ సర్వీస్, నేవీ కలిసి అటాక్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

మరోవైపు ఉక్రెయిన్- రష్యా మధ్య ఏళ్ల తరబడి యుద్ధం నడుస్తూనే ఉంది. ఇరు దేశాలు ఒకరిమీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేసింది. 36 క్షిపణులు, 600 డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ తోపాటుగా ఉక్రెయిన్ లోని మిగతా నగరాలపై దాడులకు పాల్పడింది. వీటిలో దాదాపు 550 కు పైగా డ్రోన్ లు, 19 మిసైల్స్ ను నేలకూల్చినట్లు స్పష్టం ఉక్రెయిన్ స్పష్టం చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడులను రష్యా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. మరోవైపు ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనపై శాంచి చర్చలు జరుగుతున్న క్రమంలో ఇలాంటి దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications