బ్లూ మూన్ వజ్రం విలువ రూ. 284 కోట్లు

జెనీవా: చాలా అరుదైన ఓ వజ్రం భారీ ధరకు అమ్ముడు పోయింది. వేలం పాట నిర్వహకులు అనుకున్నట్లు గానే ఆ అరుదైన వజ్రం రికార్డు స్థాయిలో అమ్ముడు పోయింది. ప్రపంచ దేశాలలో చాల అరుదుగా ఉండే బ్లూ మూన్ అనే ఈ వజ్రాన్ని రూ. 284 కోట్లకు విక్రయించారు.

జునీవాలో సోత్ బీ అనే వజ్రాల వ్యాపారం చేసే సంస్థ అరుదైన బ్లూ మూన్ అనే వజ్రాన్ని వేలం పాటలో పెట్టారు. నిర్వహకులు అనుకున్నట్లుగానే బుధవారం వేలం పాటకు అనేక మంది వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు హాజరైనారు.

Blue Moon Diamond Fetches Record Rs.284 Crore at Geneva auction

12.03 క్యారెట్లు ఉన్న ఈ బ్లూ మూన్ అనే వజ్రాన్ని ఓ వ్యాపారి రూ. 284 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ బ్లూ మూన్ వజ్రంలో ఒక్క లోపం కూడా లేదని, ఈ వజ్రానికి ఇంత ధర రావడం సహజమేనని సోత్ బీ అంతర్జాతీయ నగలు, వజ్రాల విభాగం అధిపతి డేవిడ్ బెన్నెట్ అంటున్నారు.

బ్లూ మూన్ వజ్రం రూ. 231 కోట్లు- రూ. 363 కోట్ల మద్యలో అమ్ముడుపోతుందని తాము భావించామని డేవిడ్ బెన్నెట్ చెప్పారు. అయితే తాము అనుకున్నట్లే బ్లూ మూన్ వజ్రం అధిక ధరకు అమ్ముడు పోయిందని, తమకు సంతోషంగా ఉందని వేలం పాట నిర్వహకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+