ఐసిస్‌కు బోరో హరామా ఉగ్రవాదుల మద్దతు

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులకు మరో ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఐసిస్ కిరాతకాలు, రక్తపాతాలను రోజుకు ఒక విధంగా మార్చుకుంటున్నారు. తాజాగా కొందరిని దారుణంగా హత్య చేసి మృతదేహాలను తల్లకిందులుగా వేలాడదీశారు. హత్యకు గురైన వారు ఇరాక్ సైనికులు అని ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

ఇరాక్‌లోని మోసుల్ నగరం సమీపంలోని కిర్కక్ ప్రాంతంలో ఆదివారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 8 మంది మృతదేహాలను తల్లకిందులుగా వేలాడదీశారు. 8 మంది గోంతులు కోశారు. మృతదేహాలపై... మాతో పెట్టుకున్న వారికి ఇదే గతి పడుతుందని అరబిక్‌లో వ్రాసిన బోర్డులు తగిలించారు.

వీరిని హత్య చెయ్యక ముందు ఇనుప పంజరాలలో బంధించి మోసుల్ నగరం మొత్తం ఊరేగించారు. ఆ సమయంలో ఐసిస్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని లేదంటే మీకు ఇదే గతి పడుతుందని నగరంలో నినాదాలు చేశారు. ఆ సమయంలో స్థానికులు హడలిపోయారు.

Boko Haram Pledges Allegiance to ISIS

అనంతరం కిర్కల్ ప్రాంతానికి తీసుకు వచ్చి ఒక షేడ్ లాగా ఏర్పాటు చేసిన చోట వారి గొంతులు కోసి వేశారు. చివరికి కాళ్లు పైకి తలలు కిందకు వేలాడదీశారు. ఐదుగురి తలలు పూర్తిగా తెగిపోయాయి. విషయం తెలుసుకున్న ఇరాక్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాదీనం చేసుకునే ధైర్యం చేయలేకపోయారు.

8 మంది ఇరాక్ సైనికులను పట్టుకుని వారిని చిత్రహింసలు పెట్టి తరువాత హత్య చేశారని ఇరాక్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇరాక్ ప్రభుత్వం మాత్రం హత్యకు గురయింది తమ సైనికులని అధికారిక ప్రకటన చేయలేదు.

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద కలాపాలకు ఆకర్షితులైన నైజీరియాకు చెందిన బోకో హరామ్ అనే ఉగ్రవాద సంస్థ మీకు మేము ప్తూర్తి మద్దతు ఇస్తున్నామని అధికారికంగా ప్రకటించింది. బోకో హరామ్ ఉగ్రవాద సంస్థ నైజీరియాలో ప్రజలను ఇష్టం వచ్చినట్లు ఊచకోత కోస్తుంటోంది. ఐసిస్‌కు వీరు మద్దతు తెలపడంతో ఇరాక్ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+