కెనడాలోని ఒంటారియోలో ఇండియన్ రెస్టారెంట్ వద్ద బాంబు పేలుడు
ఒంటారియో: కెనడాలోని ఇండియన్ రెస్టారెంట్ వద్ద బాంబు బ్లాస్ట్ చోటు చేసుకుంది. ఒంటిరియాలోని మిస్సిసౌగా ప్రాంతంలోని బాంబే బెల్ అనే ఇండియన్ రెస్టారెంట్ వద్ద ఈ బాంబు పేలింది. పలువురు గాయపడ్డారు.
గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడున్న వారు అరుపులు, కేకలతో అక్కడి నుంచి పరుగెత్తారు. స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

స్థానిక పోలీసులు అనుమానితుల ఫోటోలను కూడా విడుదల చేశారు. ఫోటోలో ఉన్న వ్యక్తి పురుషుడు. అతను డార్క్ రంగులోని పూర్తి చేతులతో ఉన్న షర్ట్‌ను వేసుకున్నాడు. ముఖాలకు నల్లటి ముసుగు ధరించారు.












Click it and Unblock the Notifications