Viral Video: స్నేహితులంటే మీరే.. క్యాన్సర్ తో పోరాడుతున్న సహచరవిద్యార్థి కోసం ఏం చేశారంటే..
కొందరు చేసే పనులు ఎందరికో ఆదర్శంగా ఉంటాయి. అవి మనకు ప్రేరణగా నిలుస్తాయి. ఇలానే ఓ వీడియో ప్రేరణగా నిలువనుంది. ఈ వీడియో ఖచ్చితంగా మీ ముఖంలో చిరునవ్వును తెస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక బాలుడు తన సహవిద్యార్థులు చేసిన పనికి ఆశ్చర్యపోయి ఆనందం వ్యక్తం చేశాడు. వారు చేసిన పని అతని ముఖంలో చిరునవ్వును తెచ్చింది. అతని సహవిద్యార్థులు బాలుడికి సంఘీభావంగా తలలు గుండు కొట్టి ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.

1 మిలియన్ కు పైగా వ్యూస్
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే 1 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఓ బాలుడి క్యాన్సర్ రావడంతో అతనికి చికిత్సను ప్రారంభించారు. అతన్ని ఉత్సాహపరిచేందుకు సహవిద్యార్థులు, స్నేహితులు ఉత్తమ ఆలోచన చేశారు. క్యాన్సర్ కు చికిత్స అంటే గుండ కొట్టిస్తారు. ఆ బాలుడికి కూడా గుండు కొట్టించారు.

అవాక్కైన బాలుడు
అతను పాఠశాలకు వస్తే అతనొక్కడే గుండుతోటి వేరైటీగా చూస్తారు. అందుకని అతడికి సంఘీభావంగా సహచర విద్యార్థులు గుండు చేయించుకుంటున్నారు. ఆ బాలుడు పాఠశాలకు రాగానే స్నేహితులను చూసి అవాక్కయ్యాడు. ఇది అతనికి నవ్వు తెప్పించింది. ఈ వీడియోకు "ఒంటరిగా ఎవరూ పోరాడరు: కేన్సర్ చికిత్సలు ప్రారంభించిన వారి స్నేహితుడికి సంఘీభావంగా శిరోముండనం చేయించుకున్నారు. ఒక అందమైన & ఉత్తేజకరమైన ఆశ్చర్యం"అని క్యాప్షన్ పెట్టారు.
స్నేహితులంటే మీరే
ఈ వీడియోకు నెటిజన్ల నుంచి కామెంట్లు వచ్చాయి. స్నేహితులంటే మీరే అని చాలా మంది రాసుకొచ్చారు. ఇలాంటి ఫ్రెడ్స్ ఉన్న ఆ బాలుడు అదృష్టవంతుడు అని ఒకరు రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications