బాధ వర్ణనాతీతం: ముళ్ల పందిని మింగి.. నరకం చూసిన పాము(వీడియో)

Subscribe to Oneindia Telugu

బ్రెజిలియా: ఆ పాముకు బాగా ఆకలేసింది. ఎటు చూసిన ఏమీ దొరకలేదు. అయితే, అప్పుడే అటువైపుగా వచ్చిన ముళ్లపంది కనబడటంతో వేటాడి దాన్ని మింగేసింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. తిన్నాక మాత్రం ఆ ముళ్లపంది పాముకు నరకం చూపింది. దానికి ఉన్న ముళ్లు పాము మింగినా కొద్ది.. పాము శరీరాన్ని ఛిద్రం చేశాయి. దీంతో ఆ పాము బాధ వర్ణనాతీతంగా మారింది. ఈ ఘటన బ్రెజిల్ చోటు చేసుకుంది.

కాగా, పాము శరీరం నుంచిముళ్లు బయటికి రావడం గమనించిన స్థానికులు అదేదో కొత్త రకం పాము అనుకుని వీడియోలు, ఫొటోలు తీయడం మొదలు పెట్టారు. ఓ పక్క ముళ్లు గుచ్చుకుని శరీరం తూట్లు పడి ఆ పాము నరకయాతన పడుతుంటే.. ఓ కుక్క దానిపై దాడి చేసింది. దీంతో ఆ పాము బాధ మరింత ఎక్కువైంది.

కుక్క దాడి నుంచి తనని తాను కాపాడుకోవడానికి శరీరాన్ని ముడుచుకోవాలని ప్రయత్నించింది, కానీ ముళ్లు గుచ్చుకుంటుండంతో ఏమీచేయలేని స్థితిలో ఉండిపోయింది. కాగా, బోవా జాతికి చెందిన ఇలాంటి పాములు ఎక్కువగా గబ్బిలాలు, ఎలుకలు, పక్షులు, బల్లులు తింటుంటాయి.

కాగా, వీటికి తిండి ఆరగించుకోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు రోజులైనా పడుతుంది. అలాంటిది ఓ ముళ్ల పందిని మింగిన ఈ పాము మాత్రం బతికేందుకే ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The impaled reptile had apparently attempted to eat the porcupine - but came off worse when the animal defended itself with its quills.
Please Wait while comments are loading...