Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BRICS 2024: మోడీ-జిన్‌పింగ్ కీలక భేటీ, భారత్-చైనా సరిహద్దులో శాంతికి ముందడుగు

BRICS 2024: భారత్-చైనా మధ్య సరిహద్దులో శాంతి కోసం కీలక ముందడుగు పడింది. రష్యాలోని కజన్‌లో జరుగుతోన్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. సరిహద్దు గస్తీపై జరిగిన ఒప్పందాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ఇరు దేశాల ప్రాధాన్యంా ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

ఐదేళ్ల తర్వాత అధికారికంగా సమావేశం అవుతున్నాం. భారత్-చైనా సంబంధలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, సుస్థిరత, పురోగతికి ఎంతో ముఖ్యని విశ్వవిస్తున్నాం. గత నాలుగేళ్లుగా సరిహద్దులో తలెత్తిన సమస్యలపై ఇటీవల వచ్చిన ఏకాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం మన ప్రాధాన్యంగా ఉండాలి. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వ అనేవి మన సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలి అని ప్రధాని మోడీ ఈ భేటీ సందర్భంగా స్పష్టం చేశారు.

BRICS 2024 PM Modi-Xinping meeting key talks agreement for peace on India-China border

భారత్‌ మద్దతు - చర్చలు, దౌత్యానికే కాని.. యుద్ధానికి కాదని రష్యాలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ స్ఫష్టం చేశారు. శాంతియుత చర్చల ద్వారా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ముగియాలన్నారు. గాజా, లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిగేలా, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం సాధ్యమైనంత త్వరగా ముగిసేలా బ్రిక్స్‌ ఒత్తిడి చేయాలని జిన్‌పింగ్‌ అన్నారు.

'భారత్​-చైనాల మధ్య నెలకొన్న విభేదాలు, విరోధాలు సమసిపోవడానికి ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందాలి' అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు. కాగా, మోడీ- జిన్​పింగ్ మధ్య జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల అత్యున్నతస్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ, కీలక గస్తీ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మోడీ-జిన్​పింగ్​ భేటీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, గత ఐదేళ్లలో మోడీ - జిన్ పింగ్ లు అధికారికంగా చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2022 నవంబర్‌​లో ఇండోనేషియాలో జరిగిన జీ20 సమావేశంలో పాల్గొన్న మోడీ.. జిన్​పింగ్‌​లు - ఓ విందులో కలిసి మాట్లాడారు. ఐదేళ్ల తరువాత మళ్లీ ఈ ఇరువురు నేతలు తాజాగా రష్యాలో భేటీ అయ్యారు.

మరోవైపు, ప్రధాని మోడీ బ్రిక్స్ సమావేశం సందర్భంగా, విడిగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్​‌తో భేటీ అయ్యారు. ఆ తరువాత యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్​ అల్ నహ్యాన్‌​తోనూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాగా, బ్రిక్స్ సమావేశాలు ముగియడంతో ప్రధాని మోడీ రష్యా నుంచి ఢిల్లీకి బయల్దేరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+