మాతోనే ఆటలా..: డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

Modi Trump meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అధ్యక్షుడి అధికారిక నివాసం రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే ఇద్దరు నేతల మధ్య ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరంచుకుంది.

వైట్ హౌస్‌లో కీలక భేటీ..

భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున సరిగ్గా 2:30 గంటలకు వైట్ హౌస్‌కు చేరుకున్నారు మోదీ. వైట్ హౌస్ సిబ్బంది ఆయనను సాదరంగా స్వాగతం పలికారు. ట్రంప్ ఎదురేగి ఆహ్వానం పలికారు. ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. మంత్రులను పరిచయం చేశారు ట్రంప్. విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో సహా ఇతర మంత్రులను పేరుపేరునా పరిచయం చేశారు.

ఓవల్ వేదికగా..

ఆ కొద్దిసేపటికి ఓవల్ ఆఫీస్‌ ఛాంబర్‌కు వెళ్లారు. అక్కడే ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలుకుని, భారత్‌పై ప్రతిపాదించిన ట్రేడ్- టారిఫ్ పెంపు అంశం వరకూ వారిద్దరూ చర్చించుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలపై వంద శాతం టారిఫ్‌ను విధించాలని భావిస్తోన్నారు ట్రంప్.

Modi Trump

బ్రిక్స్ ఈజ్ డెడ్..

బ్రిక్స్ ఈజ్ డెడ్.. అంటూ మోదీతో భేటీకి రెండు గంటల ముందే ప్రకటించారు కూడా. బ్రిక్స్ సభ్య దేశాలపై వంద శాతం టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించారు. ఇదే బ్రిక్స్‌లో భారత్ సైతం సభ్య దేశం కావడం ఆందోళనకు గురి చేసే అంశం. భారత్‌తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేసియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఇందులో సభ్యత్వం ఉంది. తాజాగా అమెరికా విధించనున్న 100 శాతం టారిఫ్ విధానం ఆయా దేశాలన్నింటికీ వర్తిస్తుంది.

డాలర్‌తో గేమ్స్

బ్రిక్స్ సభ్య దేశాలన్నీ కూడా డాలర్‌తో గేమ్స్ ఆడుతున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు ట్రంప్. ఇదే అంశం మోదీతో భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. అదనపు పన్నులు, ట్రేడ్, ఆర్థికం, వాణిజ్య అంశాలపై కూలంకషంగా ట్రంప్‌తో చర్చించారు మోదీ. భారత్, అమెరికా వంటి దేశాల్లో వినియోగ అవసరాలను సద్వినియోగం చేసుకోవడం, మార్కెట్ యాక్సెస్‌పై మాట్లాడారు.

వివరణాత్మక చర్చలు..

వంద శాతం టారఫ్ వల్ల ఇతర దేశాలు, రీజియన్ల నుండి తలెత్తే ఆందోళనకర పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లారు. వివరణాత్మక చర్చలు జరిపారు. ట్రేడ్ వార్ తలెత్తకుండా అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రతిపాదించారు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకనే మార్గాల గురించి చర్చించారు. విభిన్న రంగాల్లో కలిసి పనిచేయాలని, పరస్పర ప్రయోజనాలను కలిగించే వాణిజ్య ఒప్పందాలు కుదిరేలా ముందడుగు వేయాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+