భారతీయులకు బ్రిటన్ షాక్-మీ వ్యాక్సిన్లు పనిచేయవు-మా వ్యాక్సిన్ తప్పనిసరి-లేకుంటే క్వారంటైన్

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా వ్యాప్తి భయాలు వెంటాడుతున్నాయి. సెకండ్ వేవ్ నుంచి ధర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలతో దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అయితే భారత్ తో పాటు మరికొన్ని దేశాల పౌరులు వ్యాక్సిన్లు వేయించుకుని తమ దేశానికి వస్తున్నా బ్రిటన్ మాత్రం ఆంక్షలు విధిస్తోంది. మీరు వ్యాక్సిన్ వేయించుకున్నా వేయించుకోనట్లేనంటూ వారిని క్వారంటైన్ కు పంపుతోంది. దీంతో ఇప్పుడు బ్రిటన్ వెళ్లాలంటే భారతీయులు హడలిపోతున్నారు.

 వెంటాడుతున్న ధర్డ్ వేవ్ భయాలు

వెంటాడుతున్న ధర్డ్ వేవ్ భయాలు

కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచదేశాలకు ధర్డ్ వేవ్ భయాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. సెకండ్ వేవ్ లో జరిగిన ఉత్పాతాన్ని కళ్లారా చూసిన ఆయా దేశాలు ఇప్పుడు ధర్డ్ వేవ్ అంతకన్నా భయంకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్డ్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ కు దారి తీసిన పరిస్ధితులే ఇప్పుడూ ఉన్నాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆంక్షల్సి సడలించేందుకు ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. ఇదే కోవలో బ్రిటన్ కూడా విదేశాల నుంచి వస్తున్న పౌరులకు కఠినమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. తాజాగా విధించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తామని చెబుతోంది.

 బ్రిటన్ తాజా ఆంక్షలివే

బ్రిటన్ తాజా ఆంక్షలివే

కరోనా ధర్డ్ వేవ్ ముప్పు ఎదుర్కొంటున్న టాప్ దేశాల్లో ఒకటైన బ్రిటన్.. ఇప్పుడు దాన్ని తప్పించుకునేందుకు విదేశీ ప్రయాణాల్ని, విదేశీ పౌరుల్ని కట్టడి చేయాలని నిర్ణయించింది. అందుకే కరోనా ముప్పు ఉంటుందని అంచనా వేస్తున్న భారత్ తో పాటు మరికొన్ని దేశాల్ని ఈ నిబంధనల పరిధిలోకి తెచ్చేసింది. ఇప్పుడు ఆయా దేశాల నుంచి బ్రిటన్ రావాలంటే మాత్రం సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. వీటిని పాటించకుంటే మాత్రం నిర్దాక్షిణ్యంగా క్వారంటైన్ కు పంపేస్తున్నారు. దీంతో బ్రిటన్ వెళ్లాలంటే భారత్ సహా పలు దేశాల పౌరులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.

 మీ వ్యాక్సిన్లు చెల్లవు-మా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే

మీ వ్యాక్సిన్లు చెల్లవు-మా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే

బ్రిటన్ ఆంక్షలు పెడుతున్న దేశాల జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, టర్కీ, జోర్డాన్, రష్యా, థాయ్ లాండ్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి. ఆయా దేశాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ల ప్రక్రియలో వ్యాక్సిన్లు వేయించుకున్నా కరోనా ముప్పు తప్పడం లేదని నిర్ధారణకు వచ్చిన బ్రిటన్.. అక్కడి నుంచి వచ్చే పౌరులు తప్పనిసరిగా తమ వ్యాక్సిన్ వేయించుకుంటేనే వ్యాక్సిన్ వేయించుకున్నట్లు అంటోంది. దీంతో ఆయా దేశాల్లో వ్యాక్సిన్లు వేయించుకున్న వారు కూడా మరోసారి బ్రిటన్ లో వ్యాక్సిన్లు వేయించుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

 వ్యాక్సిన్ వేయించుకోకపోతే 10 రోజుల క్వారంటైన్

వ్యాక్సిన్ వేయించుకోకపోతే 10 రోజుల క్వారంటైన్

భారత్ తో సహా విదేశాల నుంచి వచ్చే పౌరులు వ్యాక్సిన్లు వేయించుకున్నా వారిని వ్యాక్సిన్ వేయించుకోనట్లుగానే పరిగణిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం... వారిని 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్ కు పంపుతోంది. అక్కడ వారికి వ్యాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత మాత్రమే దేశంలో తిరిగేందుకు వారికి వీలు కల్పిస్తున్నారు. లేకుంటే వారి స్వస్ధలాలకు తిప్పి పంపేందుకూ బ్రిటన్ సర్కార్ సిద్ధమవుతోంది. దీంతో బ్రిటన్ కు ప్రయాణాలు చేయాలంటేనే ఆయా దేశాల పౌరులక చుక్కలు కనిపిస్తున్నాయి. బ్రిటన్ సర్కార్ ఇచ్చే వ్యాక్సిన్ తీసుకుంటే మాత్రం వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రయాణాలు చేయొచ్చు. అలాగే ఎలాంటి టెస్టులు కూడా లేకుండా దేశంలోకి అడుగు పెట్టొచ్చు కూడా.

Recommended Video

    Secret British-Era Tunnel Found In Delhi Assembly, Leads To Red Fort | Oneindia Telugu
     భారతీయులకు స్పెషల్ ఆంక్షలు

    భారతీయులకు స్పెషల్ ఆంక్షలు

    ప్రస్తుతం భారతీయులకు బ్రిటన్ విధిస్తున్న ఆంక్షల్ని ఓసారి గమనిస్తే మనం వారికి ఎంత స్పెషలో ఇట్టే అర్ధమవుతుంది. భారతీయులు ప్రస్తుతం బ్రిటన్ వెళ్లాలంటే వారు మూడు రోజుల ముందుగా కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే బ్రిటన్ లో అడుగు పెట్టాక రెండో రోజు, 8వ రోజు కూడా పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు అందుకు అవసరమైన మొత్తం కూడా ముందే చెల్లించాలి. అలాగే బ్రిటన్ లో అడుగుపెట్టడానికి 48 గంటల ముందే ప్రయాణికులు అక్కడికి వచ్చాక ఎక్కడున్నారో గుర్తించేందుకు ఇచ్చే లొకేటర్ ఫాం కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్రిటన్ వచ్చాక ఇంట్లో కానీ, ప్రభుత్వం సూచించిన చోట కానీ 10 రోజుల క్వారంటైన్ లో ఉండాల్సిందే. భారతీయులకే ఎందుకీ స్పెషల్ నిబంధనలంటే వారు భారత్ లో వేయించుకున్న వ్యాక్సిన్లను బ్రిటన్ గుర్తించడం లేదు కాబట్టి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+