రన్ వేపై విమానంలో మంటలు (వీడియో)

లాస్ వేగాస్: టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్ వే మీదకు వచ్చిన విమానంలో ఆకస్మికంగా మంటలు చెలరేగిన సంఘటన అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం లాస్ వేగాస్ నగరంలోని మెక్ కారెన్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది.

బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777-200 విమానం లాస్ వేగాస్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. విమానంలో ఇంధనం నింపుకొన్న తరువాత టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్ వే మీదకు వచ్చింది. విమానంలో 159 మంది ప్రయాణికులు 13 మంది సిబ్బంది ఉన్నారు.

British Airways plane catches fire in America

టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో విమానంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. విషయం గుర్తించిన పైలెట్ విమానం నిలిపివేశాడు. విమానంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రయాణికులు నానా ఇబ్బంది పడ్డారు.విషయం గుర్తించిన ఎయిర్ పోర్టు సిబ్బంది పరుగున విమానం దగ్గరకు చేరుకున్నారు.

అత్యవసర కిటికీలు బద్దలుకొట్టి ప్రయాణికులను రక్షించారు. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు గాయాలైనాయి. మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారు. రెండు నిమిషాలు అలస్యం అయితే పెద్ద ప్రమాదం జరిగేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+