క్రిస్మస్ వేడుకలు చేసుకుంటే జైలు శిక్ష, జరిమానా

బ్రూనై: బ్రూనైలో క్రిస్మస్ వేడుకల పైన సుల్తాన్ హసనల్ బొల్కియా కఠిన ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే చట్టాన్ని తీసుకు వచ్చారు. క్రైస్తవులు బహిరంగంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోరాదని, క్రిస్మస్ చెట్లను ఏర్పాటు చేయరాదని చట్టం తెచ్చారు.

మతపరమైన పాటలు పాడటం, క్రిస్మస్ శుభాకాంక్షలు బహిరంగంగా చెప్పుకోవడం లాంటి చర్యలను నిషేధిస్తున్నట్లు బ్రూనై మత విశ్వాసాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లీంలు ఎవరు కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది.

Brunei bans Christmas celebrations in public including wearing Santa hats

అమెరికాలో ఉన్న తన బెవర్లీ హిల్స్ హోటల్, హోటల్ బెల్ ఎయిర్‌లకు చెందిన హోటళ్ల చైన్ అన్నింటిలోను బ్రూనై సుల్తాన్ క్రిస్మస్ వేడుకలను ఈ ఏడాది నిషేధించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన చిన్న దేశంగా గుర్తింపు పొందిన బ్రూనైలో ముస్లీంలు 80 శాతం, క్రైస్తవులు, బౌద్ధులు 20 శాతం ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+