COP26 Summit: 2070 నాటికి భారత్ ‘జీరో’ కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తుంది: ప్రధాని మోడీ
గ్లాస్గో: బ్రిటన్‌లోని గ్లాస్గోలో జరిగిన 2021 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. 2070 నాటికి పూర్తి నికర-శూన్య కర్బన ఉద్గారాలను సాధించడానికి, శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో పారిస్ డిక్లరేషన్ కట్టుబాట్లపై 'లేఖ, స్ఫూర్తి'ని అందజేస్తున్న ఏకైక దేశం భారతదేశమని తేల్చిచెప్పారు. 'ఇప్పటివరకు అన్ని వాతావరణ ఆర్థిక వాగ్దానాలు పూర్తి చేయబడలేదని, అభివృద్ధి చెందిన దేశాలు 1 ట్రిలియన్ డాలర్ క్లైమేట్ ఫైనాన్స్‌ను ముందుగా నిర్ధారించాలి' అని ప్రధాని మోడీ చెప్పారు.

క్లైమేట్ ఫైనాన్స్ విషయంలో తమ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన దేశాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మోడీ చెప్పినట్లు పీటీఐ తన కథనంలో వెల్లడించింది. 2030 నాటికి భారతదేశం మొత్తం అంచనా వేసిన ఉద్గారాల నుండి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు.
గ్లాస్గోలో జరిగిన కాప్26 సమ్మిట్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతదేశం కార్బన్ తీవ్రతను 45 శాతం తగ్గిస్తుందన్నారు. గ్లోబల్ క్లైమేట్ చర్చలో ఉపశమనానికి ఉన్నంత ప్రాముఖ్యత ఈ అనుసరణకు లభించలేదని ప్రధాని మోడీ అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది అన్యాయం అని ఆయన అన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi recites a mantra as he starts his address at #COP26 in Glasgow, Scotland
— ANI (@ANI) November 1, 2021
(Source: DD News) pic.twitter.com/xVyc62mrfm
ప్రధాని మోడీ ఇంకా మాట్లాడుతూ.. భారతదేశంలో మాదిరిగానే, వాతావరణం చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యవసాయ రంగానికి పెద్ద సవాలుగా ఉందన్నారు. తాగునీటి వనరుల నుంచి సరసమైన గృహాల వరకు అన్ని వాతావరణ మార్పులను తట్టుకునేలా చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.
వాతావరణ మార్పుల అనుకూల విధానాలను పాఠశాలల సిలబస్‌లో చేర్చి, రాబోయే తరాలకు సమస్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు.
The @COP26 Summit offers a wonderful opportunity to interact with various world leaders.
— Narendra Modi (@narendramodi) November 1, 2021
In a short while, I will be delivering the National Statement at the Summit. pic.twitter.com/25l4SqnHBH
Recommended Video
ఇక ప్రధాని మోడీ భారతదేశం నుంచి 5 'అమృత తత్వా'లను పంచుకున్నారు
భారతదేశం 2030 నాటికి నాన్-ఫాసిల్ ఎనర్జీ సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు చేరుస్తుంది
2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాలలో 50% పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చుకుంటుంది
భారతదేశం తన నికర అంచనా వేసిన కార్బన్ ఉద్గారాలను ఇప్పటి నుంచి 2030 వరకు 1 బిలియన్ టన్నులు తగ్గిస్తుంది
2030 నాటికి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను 45% కంటే ఎక్కువ తగ్గిస్తుంది
2070 నాటికి భారతదేశం 'నెట్ జీరో' కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తుంది.












Click it and Unblock the Notifications