అయ్యా బాబోయ్.. 42 కోట్ల జరిమానా.. ఎందుకో తెలిస్తే షాక్..!
కాలిఫోర్నియా : ఇల్లు కట్టుకుందామని అనుకున్న ఓ జంటకు ఝలక్ ఇచ్చింది న్యాయస్థానం. ఇల్లేమో గానీ 42 కోట్ల రూపాయల జరిమానా విధించడంతో కంగుతిన్నారు ఆ దంపతులు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో తెలియక తిప్పలు పడ్డారు. చివరకు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతకు ఏం జరిగిందంటే.. చెట్టును నరికివేయడమే ఆ జంట చేసిన పెద్ద తప్పు.
కాలిఫోర్నియాలో నివసించే ఓ జంట ఇళ్లు కట్టుకుందామని ఫిక్స్ అయ్యారు. అయితే తమ స్థలం దగ్గర ఓ చెట్టు ఉండటంతో దాన్ని తవ్వేశారు. కేవలం చెట్టు కొట్టేస్తేనే కోర్టు అంత పెద్ద జరిమానా విధిస్తుందా అనే అనుమానం రావొచ్చు. కానీ వాళ్లు కొట్టేసింది మామూలు చెట్టు కాదు. 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఓక్ ట్రీ. అయితే వారు చేపట్టిన తవ్వకాలతో ఆ ఓక్ ట్రీ వేర్లు బాగా దెబ్బతిన్నాయట. అంతేకాదు ఒక చారిత్రక కట్టడాన్ని కూడా వీళ్లు ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఆ రెండు అభియోగాలతో ఐదేళ్ల కిందట 2014లో ఆ దంపతులపై కేసు నమోదైంది. ఆనాటి ఆ రెండు కేసులకు సంబంధించి న్యాయస్థానం తాజా తీర్పు వెలువరించింది. చారిత్రక సంపదను ధ్వంసం చేసేవారిని క్షమించేది లేదన్న కోర్టు.. ఆ జంటకు 42 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications