వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు.. వణుకుతున్న కాలిఫోర్నియా, 1000కి పైగా ఇళ్లు దగ్ధం!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అడవుల్లో కార్చిచ్చులు సహజమే కానీ వారం క్రితం మొదలైన కార్చిచ్చు మాత్రం కాలిఫోర్నియా వాసులను వణికిస్తోంది. అమెరికా చరిత్రలోనే ఆరో అతిపెద్ద కార్చిచ్చుగా దీనిని అభివర్ణిస్తున్నారు.

ప్రస్తుతం అమెరికాలో రగులుకున్న కార్చిచ్చు ఎంత పెద్దదంటే.. ఏకంగా న్యూయార్క్ నగరమంత పరిమాణంలో ఇది విస్తరించింది. ఈ కార్చిచ్చును చల్లార్చడానికి కాలిఫోర్నియా అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు.

విస్తరిస్తున్న ‘థామస్ ఫైర్’...

విస్తరిస్తున్న ‘థామస్ ఫైర్’...

దక్షిణ కాలిఫోర్నియాలోని శాంటాపౌలా నగరానికి ఉత్తరాన స్టెకెల్ పార్క్, థామస్ అక్వినాస్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో డిసెంబర్ 4న మొదలైన కార్చిచ్చు ఇప్పటి వరకు 2 లక్షల 30 వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని బుగ్గి చేసింది. థామస్ ఫైర్‌గా పిలవబడుతున్న ఈ కార్చిచ్చు వెంచురా, శాంతాబార్బరా కౌంటీల్లో అంతకంతకు విస్తరిస్తోంది. దీంతో ప్రభావిత ప్రాంతాలైన వెంచురా, ఓజాయ్, శాంటాపౌలా నగరాల్లోని దాదాపు లక్ష మంది తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.

ఐదో అతిపెద్ద కార్చిచ్చు...

ఐదో అతిపెద్ద కార్చిచ్చు...

సోమవారం శాంటాపౌలాలోని అటవీ ప్రాంతంలో కూడా మంటలు చెలరేగాయి. గంటకు 65 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు ఇందుకు తోడవగా కొద్ది గంటల్లోనే కార్చిచ్చు 25 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని దహించి వేసింది. అమెరికాలో ఇప్పటి వరకు చెలరేగిన కార్చిచ్చుల్లో థామస్ ఫైర్ కూడా ఒకటి. కాలిఫోర్నియా చరిత్రలోనే దీనిని ఆరో అతిపెద్ద కార్చిచ్చుగా అభివర్ణిస్తున్నారు. సోమవారం ఉదయానికి ఈ కార్చిచ్చు లేక్ కాసిటాస్, ఒజాయ్ ప్రాంతాలను చుట్టుముట్టింది. ఇప్పటి వరకు 1000కిపైగా ఇళ్లు ఈ కార్చిచ్చు దెబ్బకు బుగ్గి అయ్యాయి.

ఇదే భయంకరమైన కార్చిచ్చు..

ఇదే భయంకరమైన కార్చిచ్చు..

సోమవారం సాయంత్రానికి కార్చిచ్చు మంటలు శాంటాబార్బరా కౌంటీలోని మోంటెసిటో సరిహద్దులోకి ప్రవేశించాయి. బార్బరా నిమ్మో అనే మహిళ మాట్లాడుతూ తన జీవితంలో జకాలాంటి ఎన్నో పెద్ద పెద్ద కార్చిచ్చులను చూసినట్లు పేర్కొన్నారు. 2007లో జకా కార్చిచ్చు 2 లక్షల 40 వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని దగ్ధం చేయగా 40 ఏళ్ల క్రితం రొమిరో కెన్యాన్ ప్రాంతంలో మరో అతిపెద్ద కార్చిచ్చు కొన్ని లక్షల ఎకరాల అటవీప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. ఈ సందర్భంగా మోంటెసిటో ప్రాంతంలోని పలు మాన్షన్లకు ఎస్టేట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న బార్బారా నిమ్మా మాట్లాడుతూ ‘‘మేం ఇక్కడివాళ్లమే.. ఈ కార్చిచ్చుల గురించి మాకు బాగా తెలుసు.. అయితే ఇప్పటి వరకు నేను చూసిన కార్చిచ్చుల్లో ఇదే భయంకరమైన కార్చిచ్చు..'' అని పేర్కొన్నారు.

ఒకే వ్యక్తి రెండు ఇళ్లు ఫినిష్...

ఒకే వ్యక్తి రెండు ఇళ్లు ఫినిష్...

కాలిఫోర్నియాలో గత రెండు నెలల్లో రెండు కార్చిచ్చులు సంభవించాయి. ఈ రెండుసార్లూ డాక్టర్ ఆంటోనియో వాంగ్‌కు చెందిన ఇళ్లు దగ్ధమైపోయాయి. ఈ ఏడాది అక్టోబరు నెలలో కార్చిచ్చు సంభవించినప్పుడు శాంటా రోసాలోని తమ ఇంటిని వదిలేసి భార్యాకుమారుడితో కలిసి డాక్టర్ వాంగ్ సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. పాపం వెంచురా ప్రాంతంలో ఉన్న తన ఇంటిని ఈయన వేరకొరికి అద్దెకు ఇవ్వగా.. ఇప్పుడొచ్చిన థామస్ ఫైర్ దెబ్బకు అది కాస్తా కాలి బూడిదైపోయింది. ఈ సందర్భంగా డాక్టర్ వాంగ్ సోమవారం మాట్లాడుతూ ‘‘ఇల్లు పోతే పోయిందికానీ.. ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారు మాత్రం సురక్షితంగా ఉన్నారు.. అది చాలు.. రెండు ప్రాంతాల్లో కాలిపోయిన మా ఇళ్లను పునరుద్ధరించడం ఎలా అని ఆలోచిస్తున్నా.. '' అని వ్యాఖ్యానించారు.

అగ్నిమాపక సిబ్బందికి ప్రశంసలు...

అగ్నిమాపక సిబ్బందికి ప్రశంసలు...

థామస్ ఫైర్ కార్చిచ్చును ఆర్పడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న అగ్నిమాపక సిబ్బందిని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రముఖులకు కూడా ప్రస్తుతం కార్చిచ్చు విజృంభిస్తున్న ప్రాంతంలో ఇళ్లు ఉన్నాయి. మోంటెసిటో, శాంటా బార్బరా సబర్బ్ ప్రాంతాల్లో ఇళ్లున్న ఓప్రా విన్‌ఫ్రే, ఎలెన్ డిజెనెరెస్ లు ట్వీట్ల ద్వారా స్పందించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ టెన్నిస్ ప్లేయర్ జిమ్మీ కానర్స్‌ కూడా ట్వీట్ చేస్తూ తన ఇల్లు కూడా ప్రమాదంలో ఉందని, ఏదేమైనా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి అలుపెరగకుండా శ్రమిస్తున్నారంటూ పేర్కొన్నారు. థామస్ ఫైర్ జ్వాలలను అదుపుచేయడంలో కాలిఫోర్నియా అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేసేందుకుగాను అరిజోనా, కొలరాడో, ఇడాహో, ఒరెగాన్, ఉటాహ్, వాషింగ్టన్ స్టేట్ నుంచి కూడా అగ్నిమాపక సిబ్బందిని కాలిఫోర్నియాకు తరలించారు.

ఉచితంగా తేనీరు అందిస్తూ...

ఉచితంగా తేనీరు అందిస్తూ...

గత మంగళవారం వెంచురా కౌంటీలో థామస్ ఫైర్ కార్చిచ్చు మొదలైన దగ్గర్నించి దాన్ని అదుపుచేయడంలో అహోరాత్రాలు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బందికి ఓ కాఫీ షాపు యజమాని ఉచితంగా కాఫీ అందజేస్తోంది. మోంటెసిటీకి అగ్నేయంగా సమ్మర్‌ల్యాండ్ ప్రాంతంలో ఉన్న రెడ్ కేటిల్ కాఫీ షాపు యజమాని మెగాన్ టింగ్‌స్టార్మ్ అగ్నిమాపక సిబ్బందితోపాటు ఈ కార్చిచ్చు కారణంగా ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారందరికీ తన కాఫీ షాపు ద్వారా తేనీరు అందజేస్తోంది. ‘‘థామస్ ఫైర్ కార్చిచ్చు కారణంగా ఎంతోమంది తమ ఇళ్లు కల్పోయి నిర్శ్రయులయ్యారు.. వారి కన్నీళ్లు చూస్తోంటే నాకెంతో బాధ కలుగుతోంది.. కానీ నేనింతకన్నా ఏం చేయగలను..'' అంటూ నిట్టూర్చారు.

English summary
One week after the Thomas Fire exploded from a brush fire to a raging inferno, thousands of firefighters made some headway Monday in their struggle to contain it.The blaze is larger than all of New York City and about 20% contained as of Monday evening, according to the fire protection agency CAL FIRE. But it's only one of six major wildfires torching the state, which have destroyed more than 1,000 structures. As the flames burned in the foothills on the edge of Montecito in Santa Barbara County on Monday evening, some hoped for the best.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X