కరోనా కట్టడికి ఇక అవే గతి- న్యూయార్క్ సర్వేలో సంచలన విషయాలు...
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కట్టడికి గల మార్గాలపై అన్నిచోట్లా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటన్నింటి ముఖ్య ఉద్దేశం కరోనా వైరస్ కట్టడికి గల మార్గాలు, వీటి ఆధారంగా ఆర్ధిక వ్యవస్దను తిరిగి గాడిన పెట్టడమే. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఓ సర్వే ప్రతిబంధకాల పరీక్షల ద్వారానే కరోనా మహమ్మారికి అంతం పలకవచ్చని సూచించింది.

కరోనా కట్టడి మార్గాలపై న్యూయార్క్ సర్వే..
కరోనా వైరస్ కట్టడికి ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గాల్లో అత్యంత కీలకమైనవి యాంటీ బాడీ పరీక్షలు. అంటే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి శరీరాల నుంచి రోగ ప్రతిబంధకాలను తీసుకుని కొత్తగా కరోనా సోకిన వారి శరీరాల్లోకి చొప్పించడం. దీనిపై అమెరికాతో పాటు దాదాపు అన్ని పాశ్చాత్య దేశాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్ లోనూ వివిద ప్రభుత్వాలు ఇప్పుడు వీటిపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని న్యూయార్క్ లో స్దానికంగా నిర్వహించిన ఓ సర్వేలో ప్రతిబంధకాల పరీక్షల ద్వారా కరోనా వైరస్ మహమ్మారికి అంతం పలకవచ్చనే వాదనకు మెజారిటీ మద్దతు లభించింది.

అత్యదిక పరీక్షలతో ప్రయోజనం- ప్రభుత్వాల నిర్ణయాలు.
అమెరికాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న న్యూయార్క్ లో దాదాపు 3 వేల మంది సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్న సిబ్బందిపై నిర్వహించిన పరీక్షలలో వారిలో 21 శాతం మంది శరీరాల్లో కరోనా ప్రతిబంధకాలు ఉన్నట్లు వెల్లడైంది. న్యూయార్క్ లోని మిగిలిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో వివిధ శాతాల్లో యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. వీటిని సక్రమంగా వాడుకోగలిగితే కరోనా రోగుల్లో వైరస్ ను అడ్డుకట్ట వేయొచ్చని సర్వే తేల్చింది. భారీ సంఖ్యలో కరోనా నుంచి కోలుకున్న వారి శరీరాలపై యాంటీబాడీ పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వాలు భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవ్చచని ఈ సర్వే చెబుతోంది.

యాండీబాడీ టెస్టులతో కరోనా అంతమవుతుందా ?
అత్యధిక స్ధాయిలో యాంటీబాడీ టెస్టుల నిర్వహణ ద్వారా కరోనా వైరస్ కు ముగింపు పలకవచ్చన్న ఈ సర్వే సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇలాంటి యాంటీబాడీ పరీక్షల ద్వారా తేల్చిన ఫలితాల ఆధారంగా కమ్యూనిటీ పాస్ పోర్టులు జారీ చేయొద్దని ప్రభుత్వాలకు సూచించింది. తొలుత ఈ ప్రతిరోధకాల పరీక్షల ద్వారా ఫలితం ఉంటుందని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ తాజాగా తన అభిప్రాయాన్ని మార్చుకుంది. వీటి ఆధారంగా లాక్ డౌన్ వంటి అంశాలపై ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని తెలిపింది.

సాధారణ పరిస్ధితికి రావాలంటే..
యాంటీబాడీ టెస్టుల నిర్వహణపై ఎలాంటి అనుమానాలు లేకపోయినప్పటికీ వీటి ఆధారంగా ప్రభుత్వాలు ఆర్ధిక వ్యవస్దను తిరిగి తెరవడం, జనాన్ని సాధారణ కార్యకలాపాలకు, ప్రయాణాలకు అనుమతించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో కరోనా కేసులు తగ్గినా వైరస్ భయాలు, ప్రభావం నుంచి బయటపడాలంటే మాత్రం భారీ సంఖ్యలో యాంటీబాడీ పరీక్షలు నిర్వహించి ప్రతిరోధకాలను కరోనా రోగుల శరీరాల్లోకి చొప్పించడం ఒక్కటే మార్గం కానుందని న్యూయార్క్ సర్వే అభిప్రాయపడుతోంది.












Click it and Unblock the Notifications