వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Next China: నెక్స్ట్ చైనా ఎవరు..? మరో చైనా సృష్టి సాధ్యమా..? భారత్ కు ఆ అర్హత ఉందా..?

|
Google Oneindia TeluguNews

Next China: ఒకప్పుడు అగ్రరాజ్యం అంటే టక్కున అందరూ చెప్పే సమాధానం అమెరికా అని. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోయాయి. చైనా గత 10-15 ఏళ్లలో తన ఉత్పత్తి సామర్థ్యాలతో అతిపెద్ద శక్తిగా ఎదిగింది. ప్రపంచానికి పెద్దన్నగా మారిన చైనా ఇప్పుడు అమెరికాను సైతం ఢీకొట్టే స్థాయికి చేరింది. అయితే ఇది గతకాల చరిత్రగా మారిపోతోంది. ఎందుకంటే..

మారిపోతున్న పరిస్థితులు..

మారిపోతున్న పరిస్థితులు..


అయితే ఇప్పుడు చైనా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తి స్థావరాన్ని ఇతర దేశాలకు మార్చాలని నిర్ణయించుకున్నాయి. చైనాలో తలెత్తుతున్న అనేక సమస్యలను కంపెనీలు కారణాలుగా చూపుతున్నాయి. ఈ తరుణంలో మరో చైనాగా ఏ దేశం మారుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

మరో చైనా సాధ్యమా..

మరో చైనా సాధ్యమా..


చైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రపంచంలో మరో అతిపెద్ద తయారీ కేంద్రాన్ని నిర్మించటం సాధ్యం కాదని తెలుస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా మరో దేశం అనే మాటలు వినటానికి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ అది అంత ఈజీ కాదు.

ప్రపంచ కర్మాగారం..

ప్రపంచ కర్మాగారం..


కర్మాగారాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రహదారి నిర్మాణం, రవాణా వ్యవస్థలు, ఎగుమతి మరియు దిగుమతి ప్లాట్‌ఫారమ్‌లు చాలా సంవత్సరాలు విరామం లేకుండా గడియారంలా నడపాల్సి ఉంటుంది. దీనికి తోడు వస్తువుల ఎగుమతికి ఒక దేశం నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు తరలించడానికి సరఫరా గొలుసు, ఇతర రవాణా నిర్మాణాలు రాత్రికి రాత్రి నిర్మించటం కుదరదు. దీనికి ఏళ్ల సమయం పడుతుంది. చైనా దీనికోసం ఏకంగా 20 ఏళ్లు శ్రమించింది.

ఎప్పుడూ సిద్ధమే..

ఎప్పుడూ సిద్ధమే..


అనేక రంగాలకు సంబంధించిన కాంపొనెంట్స్ నుంచి పెద్ద మెషినరీ వరకూ అన్నింటినీ చౌకగా తయారు చేసి ఎగుమతి చేసేందుకు చైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. భారీ ఆర్డర్లను తీసుకునేందుకు, డెలివరీ చేసేందుకు అవసరమైన వనరులు ఆ దేశం వద్ద పుష్కలంగా ఉన్నాయి. ఫ్యాక్టరీల నుంచి పోర్టులు, ఇతర రవాణా మార్గాలకు అవసరమైన రోడ్లు, రవాణా సరఫరా గొలుసును చైనా ప్రభుత్వ కంపెనీలు సృష్టించాయి.

చైనాకు ప్రత్యామ్నాయాలు.. భారత్..?

చైనాకు ప్రత్యామ్నాయాలు.. భారత్..?


చైనా ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చైనా ఆధిపత్యం వచ్చే 10-15 ఏళ్ల వరకు మారదనేది వాస్తవం. ప్రస్తుతం.. USA, వియత్నాం, ఇండోనేషియాలు చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి స్థావరాలుగా నిలుస్తున్నాయి. చైనాలో కేవలం వస్తువులు మాత్రమే కాకుండా సాంకేతిక సేవలు, ఆర్థిక సేవలు, సాంకేతిక వస్తువుల తయారీలో ఉన్న బలం మేడ్ ఇన్ చైనా ప్రభంజనం కొనసాగటానికి ప్రధాన కారణం.

భారత్ ఆసియాలో బలమైన దేశంగా ఉన్నప్పటికీ చైనా స్థాయి అభివృద్ధికి ఇంకా చాలా కాలం పడుతుందని నిపుణులు అంటున్నారు. దీనికోసం దీర్ధకాలిక వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

English summary
can india replace chinas place in world and emerge as growth engine with of world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X