కెనడాలో ఇక గంజాయి అధికారికం: దానిని మనం మార్చేశామని ప్రధాని ట్వీట్

ఒట్టావా: కెనడాలో గంజాయి (మారిజునా) వాడటం ఇక అధికారికం. మంగళవారం నాడు కెనడా సెనేట్ 52-29 ఓట్లతో బిల్లుకు ఆమోదం తెలిపింది. గంజాయిని జాతీయవ్యాప్తంగా చట్టబద్దం చేసిన దేశాల్లో కెనడా రెండోది. జీ7 దేశాల్లో మొదటిది.

ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన 2015 ఎన్నికల ప్రచారంలోమారిజునాను చట్టబద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ నిషేధం అమలులో ఉంది. నిషేధం ఉన్నప్పటికీ విస్తృతంగా దొరుకుతుంది.

ఈ చట్టం వల్ల మైనర్లకు గంజాయి అందుబాటులో లేకుండా పోతుంది. మరియు ఇకపై నేరస్తులు దీనిని అమ్మి లాభాలు ఆర్జించలేరు. ఈ విషయాన్ని ట్రూడో తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Canada becomes second nation in the world to legalize marijuana

కెనడా మారిజునాను చట్టబద్ధం చేసిన నేపథ్యంలో పలు దేశాలు గమనిస్తున్నాయి. గంజాయి ఉత్పత్తిని ఫెడరల్ ప్రభుత్వం నియంత్రిస్తుంది. రాష్ట్రాలు, నగరపాలికలకు అక్కడ ప్రయివేటు దుకాణాల ద్వారా అమ్మాలా లేదా ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మాలా అనేది నిర్ణయించే అధికారం ఉంటుంది.

మారిజోనాను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఉరుగ్వే. డిసెంబర్ 2013లో దీనిని చట్టబద్ధం చేసింది. కెనడా ప్రభుత్వం జూలై 2018లో చట్టబద్ధం చేసింది. ఇప్పటి వరకు మన పిల్లలకు మారిజోనా సులభంగా లభించేదని, క్రిమినల్స్ దాని ద్వారా లబ్ధి పొందారని, కానీ ఇప్పుడు మేం దానిని మార్చి వేశామన్నారు.

Canada becomes second nation in the world to legalize marijuana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+