వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో కెనడా ఎంబసీ గోడకు ఉక్రెయిన్ మద్దతుగా బ్యానర్లు: నాటోపై డ్రాగన్ రోత రాతలు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడుతున్న క్రమంలో ఐక్యరాజ్య సమితి, నాటోతోపాటు ప్రపంచంలోని పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. రష్యా దాడులతో తీవ్రంగా నష్టపోతున్న ఉక్రెయిన్ దేశానికి యూఎన్, అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు అండగా ఉంటున్నాయి.

కెనడా ఎంబసీ బ్యానర్స్‌పై చైనా రోత రాతలు

కాగా, ఈ వారం ప్రారంభంలో, బీజింగ్‌లోని కెనడియన్ ఎంబసీ తన భవనం వెలుపల ఉక్రేనియన్ జెండా రంగులలో "మేము ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నాము" అనే పదాలను కలిగివున్న కనీసం రెండు బ్యానర్‌లను ఏర్పాటు చేసింది. స్టాండ్ విత్ ఉక్రెయిన్ అనే క్యాప్షన్‌తో బ్యానర్‌ల ఫోటోను ఎంబసీ మంగళవారం ట్వీట్ చేసింది.

అయితే, బుధవారం రాత్రికి, బీజింగ్‌లోని ఒక సీఎన్ఎన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. NATOకి వ్యతిరేకంగా అసభ్యకరమైన భాషను ఉపయోగించి బ్యానర్‌లలో ఒకటి గ్రాఫిటీ ద్వారా ధ్వంసం చేయబడింది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా అరెస్టులు జరిగాయో లేదో తెలియదు.

సంక్లిష్ట స్థితిలో చైనా..

అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దండయాత్రపై అంతర్జాతీయంగా ఆగ్రహజ్వాలలు వెళ్లువెత్తుతున్నాయి. రాష్ట్ర సార్వభౌమాధికారానికి మద్దతు ఇచ్చే బీజింగ్ స్వంత విరుద్ధమైన విధానంతో మాస్కోతో తన సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గారడీ చేస్తూ ఉక్రెయిన్‌కు సంబంధించి చైనా సంక్లిష్టమైన స్థితిలో ఉంది. ఇరు దేశాలు మధ్య సత్ససంబంధాలున్న క్రమంలో రష్యాకు వ్యతిరేకంగా చైనా వ్యహరించడం లేదు. అంతేగాక, పలు అంశాల్లో మద్దతు పలుకుతోంది. అయితే, అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో రష్యాకు వ్యతరేకంగా ఉండలేక, యూఎన్ సహా పలు దేశాల ఒత్తిడి ఉన్నా.. చైనా.. రష్యా పట్ల తన అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది.

ఉక్రెయిన్‌లో దాడులు చేస్తున్నా.. రష్యాకే చైనా మద్దతు

కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని చైనా ఖండించలేదు. అంతేగాక, రష్యాకు మద్దతుగా నిలిచింది. చైనా అధికారులు "తూర్పువైపు రష్యా ఇంటి గుమ్మం వరకు NATO విస్తరణ" దాడిని ఆరోపించారు. ఐక్యరాజ్యసమతిలోనూ రష్యాకు వ్యతిరేకంగా చైనా ఓటు వేయని విషయం తెలిసిందే. అంతేగాక, అంతర్జాతీయ సమాజం రష్యాపై ఆంక్షలను విధించడాన్ని చైనా తప్పుబట్టింది. ఎప్పుడూ అమెరికాకు వ్యతిరేకంగా ఉండే ఈ రెండు అగ్రదేశాలు పరస్సరం సహాయసహకారాలు అందించుకుంటున్నాయి. మరోవైపు, రష్యా డుల్లో సుమారు వెయ్యి మందికిపైగా సామాన్య ప్రజలు, వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ తెలిపింది. అదే సమయంలో రష్యాకు చెందిన 5వేల మంది సైనికులు హతమయ్యారని వెల్లడించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ ను తమస్వాధీనంలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. అందుకే నగరాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 10లక్షల మంది ఉక్రెయిన్ దాటి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

English summary
Canada Embassy in China put up a banner supporting Ukraine. It was vandalized within a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X