భారత్ పెద్ద తప్పు చేసినట్లే..మళ్లీ నోరు పారేసుకున్న కెనడా ప్రధాని ట్రూడో..!
భారత్-కెనడా మధ్య తాజాగా నెలకున్న పోరు మరింత ముదురుతోంది. ఇదే క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారిభారత్ పై నోరుపారేసుకున్నారు. గతేడాది సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత్ హస్తం ఉంటే ఆ దేశం భారీ పొరబాటు చేసినట్లేనని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడా గడ్డపై భారత్ లో అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకుని నరహత్యలు, దోపిడీలు, ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నట్లు కెనడా తాజాగా ఆరోపించింది.
ఈ నేపథ్యంలో రెండు దేశాలు అగ్ర రాయబారులు, దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నరు. దీంతో ఉద్రిక్తతలు బాగా పెరిగాయి.ఆ తర్వాత కెనడా ఆరోపణల్ని భారత్ ఖండించింది. ట్రూడో రాజకీయ లబ్ధి కోసం కెనడాలోని సిక్కు వర్గాలను బుజ్జగించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై స్పందించిన ట్రూడో.. హర్దీప్ సింగ్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని తమకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. కెనడా తన సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లు భారత్ చేస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించాలని కూడా తెలిపారు.

అలాగే తమకు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అయిన భారత్ తో ద్వైపాక్షిక సంబంధాన్ని తెంచుకోకుండా ఈ వ్యవహారాన్ని బాధ్యతగా డీల్ చేయాలని తాను భావిస్తున్నట్లు ట్రూడో వెల్లడించారు. అయితే దర్యాప్తులో సహాయం కోసం కెనడా చేసిన అభ్యర్థనలను భారత అధికారులు తిరస్కరించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తమ ప్రజాస్వామ్య సమగ్రతను విమర్శించడమే భారత ప్రభుత్వ విధానం అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications