వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కారు బీభత్సం... నిరసనకారుల పైకి దూసుకెళ్లి... తీవ్ర కలకలం...

|
Google Oneindia TeluguNews

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న మాన్‌హట్టాన్ ముర్రే హిల్ ప్రాంతంలో ఓ బీఎండబ్ల్యూ కారు నిరసనకారుల పైకి దూసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా... లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. శుక్రవారం సాయంత్రం 4.30గం. సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సరైన డాక్యుమెంట్స్ లేవన్న ఆరోపణలతో ఇమ్మిగ్రేషన్&కస్టమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్స్ కొంతమంది ఇమ్మిగ్రెంట్స్‌ను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ మాన్‌హట్టాన్‌లో స్థానికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మొదట ఇది 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' ఉద్యమంగా స్థానిక మీడియా రిపోర్ట్ చేసినప్పటికీ... ఇమ్మిగ్రెంట్స్ అరెస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన అని ఆ తర్వాత తెలిసింది.

 Car hits protesters in Manhattan in usa who protesting against detention Of Immigrants

కారు బీభత్సంపై న్యూయార్క్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారన్నది ఇంకా తెలియరాలేదన్నారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం మాత్రం లేదని చెప్పారు. ఆ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇది ప్రమాదమా... లేక ఉద్దేశపూర్వకంగా చేసిన దాడా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనపై మాట్లాడుతూ... కనీసం ఆరుగురు గాయపడినట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడే అని ఆరోపించారు.

Recommended Video

Hyderabad : Bandi Sanjay Comments On CM KCR Delhi Tour

ఏబీసీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ప్రమాద సమయంలో అక్కడ కనీసం 40-50 మంది నిరసనకారులు ఉన్నారు.కారులో ఇద్దరు శ్వేత జాతి మహిళలు ఉన్నారు. అయితే వారి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

English summary
At least six people were hit by a car in the Murray Hill section of Manhattan on Friday afternoon.It happened at the intersection of 39th and 3rd Avenue just before 4:10 p.m
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X