ఇంట్లో ఇల్లాలు..ఆఫీసులో ప్రియురాలు: ఈ సీఈఓ చేష్టలు చూస్తే మైండ్ బ్లాకే..!
ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. Astronomer కంపెనీ సీఈఓ ఆండీ బైరాన్, ఆయన హెచ్‌ఆర్ చీఫ్ క్రిస్టిన్ క్యాబోట్.. బోస్టన్‌లో జరిగిన కోల్డ్‌ప్లే కన్సర్ట్‌కు వెళ్లారు. అక్కడ వీళ్లిద్దరూ పెద్ద స్క్రీన్‌పై కనిపించగానే, గాయకుడు క్రిస్ మార్టిన్ "ఓహ్.. వీరిద్దరిని చూడండి" అంటూ సరదాగా కామెంట్ చేశారు.తీరా చూస్తే, ఆ ఇద్దరూ భార్యాభర్తలు కాదని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో దీనిపై ఊహాగానాలు, చర్చలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.
అసలేం జరిగింది?
కన్సర్ట్‌లో బైరాన్, క్యాబోట్ ఇద్దరూ పెద్ద స్క్రీన్‌పై కనిపించారు. Chris Martin వారిని చూసి సరదాగా మాట్లాడారు. అయితే, వారు భార్యాభర్తలు కాదని తెలియగానే, క్రిస్ మార్టిన్ కూడా కాస్త ఇబ్బందిపడి, "ఓహ్.. ఏంటిది? వీరు అఫైర్‌లో ఉన్నారా, లేదా సిగ్గుపడుతున్నారా?" అనే మరో కామెంట్ చేయడంతో ఇది మరింత చర్చకు దారితీశాయి.తమ అక్రమ సంబంధం ఈ విధంగా బయటపడడంతో బైరాన్, కాబోట్ ఆశ్చర్యపోయారు. వీడియోను చుసిన నెటిజెన్లలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

సోషల్ మీడియాలో లీకైన వ్యక్తిగత వివరాలు
కన్సర్ట్ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రంగంలోకి దిగారు. ఆండీ బైరాన్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 1.3 బిలియన్ డాలర్ల విలువైన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ 'ఆస్ట్రోనమర్'కు జూలై 2023 నుండి సీఈఓగా ఉన్నారు. ఆయనకు మేగన్్ కెర్రిగన్ బైరాన్‌తో వివాహం అయ్యింది, వారికి ఇద్దరు పిల్లలున్నారు. న్యూయార్క్‌లో నివాసం ఉంటున్నారు.మరో వైపు క్రిస్టిన్ క్యాబోట్ వైవాహిక స్థితి ఏంటనేది బహిర్గతం కాలేదు.

బైరాన్ - క్రిస్టిన్‌ల మధ్య అక్రమ సంబంధం బయటపడటంతో ఇంటర్నెట్‌లో స్పందన మామూలుగా లేదు. కోల్డ్ ప్లే కాన్సర్ట్‌కు వెళ్లడం దారుణమా లేక అక్రమ సంబంధం విషయం బయటపడటం దారుణమా అంటూ నెటిజెన్లు సెటైరికల్ కామెంట్ చేస్తున్నారు. డబ్బు హోదా ఉన్న వ్యక్తికి ఆఫీసులో కూడా ఒక భార్య ఉండటం..బాబోయ్ మతి పోగొడుతోందంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. మరికొందరైతే ఇంది ఇంటర్నెట్‌లోనే అతిపెద్ద స్కామ్‌గా వర్ణించారు.ఒక వ్యక్తి అక్రమ సంబంధం ఉందని తెలుసుకోవడం కంటే.. వాళ్లు కోల్డ్ ప్లే కాన్సర్ట్‌ను ఇష్టపడుతున్నారని ఎందుకు అనుకోకూడదు అంటూ బైరన్-క్రిస్టిన్‌లకు మద్దతుగా నిలిచాడు ఒక నెటిజెన్.
బైరన్ పేరును తొలగించిన మెగాన్
ఇక బైరాన్ క్రిస్టిన్‌ల ఎఫైర్ బయటపడటంతో బైరాన్ అతని భార్య మేగన్ కెర్రిగన్‌ల సోషల్ హ్యాండిల్స్‌కు సంబంధించిన ప్రొఫైల్స్‌ను సెర్చ్ చేయడం ప్రారంభించారు నెటిజెన్లు.మెగన్ కెర్రీగన్ బైరన్ గురించిన వివరాలు అంతగా అందుబాటులో లేవు. ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే, ఆమె తన పిల్లలతో గడిపిన సంతోషకరమైన క్షణాలకు సంబంధించిన అనేక ఫోటోలు కనిపిస్తాయి. వైరల్ వీడియో తర్వాత, ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లకు మద్దతుగా చాలా కామెంట్లు వస్తున్నాయి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మెగన్ తన సోషల్ మీడియా ఖాతాల నుండి "బైరన్" అనే ఇంటిపేరును తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆండీ బైరన్ వ్యవహారం బయటపడిన తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆండీ బైరన్, మెగన్ కెర్రీగన్, లేదా ఆస్ట్రోనమర్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

వ్యక్తిగత జీవితాలు పబ్లిక్ అవుతున్న రోజులు
ఒకప్పుడు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు మాత్రమే ఇలా బయటపడేవి. కానీ ఇప్పుడు, సోషల్ మీడియా, క్షణాల్లో సమాచారం విస్తరించే ఈ డిజిటల్ యుగంలో సామాన్యుల (లేదా ప్రముఖ కంపెనీల ఉన్నతాధికారుల) వ్యక్తిగత జీవితాలు కూడా సులభంగా పబ్లిక్ అవుతున్నాయి. ఒక చిన్న వీడియో, ఒక సరదా వ్యాఖ్య కూడా ప్రజల వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. దీని వల్ల వారికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి. డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత గోప్యత ఎంత సన్నని గీతపై నిలబడి ఉందో ఈ ఘటన గుర్తు చేస్తోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications