వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాలెంజర్-2: యుక్రెయిన్‌కు బ్రిటన్ ఇచ్చే ఈ యుద్ధట్యాంకుల ప్రత్యేకత ఏమిటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బ్రిటన్ యుద్ద ట్యాంకులు

రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్‌ను బలోపేతం చేసేందుకు ఆ దేశానికి చాలెంజర్-2 యుద్ధ ట్యాంక్‌ను ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు.

ఈ ట్యాంక్ బ్రిటిష్ సైన్యానికి చాలా కీలకమైన ట్యాంక్. ఇది యుక్రెయిన్ అత్యంత అధునాతన ట్యాంక్ అవుతుంది. ఈ ట్యాంక్ ఇరాక్ యుద్ధంలో ఉపయోగించారు.

ఈ ట్యాంక్ ద్వారా యుక్రెయిన్‌ యుద్ధసామర్థ్యం పెరుగుతుందని బ్రిటన్‌ చెబుతోంది. త్వరలో యుక్రెయిన్‌ సైనికులకు చాలెంజర్-2 మీద శిక్షణ ఇవ్వనున్నారు.

యుద్ద ట్యాంకులు

ముందుకు వచ్చిన పోలండ్

బ్రిటన్ చెబుతున్న ప్రకారం యుక్రెయిన్‌కు చేసే ఈ సాయం చాలా కీలకం అని చెప్పొచ్చు. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయానికి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి.

బ్రిటన్ తీసుకున్న నిర్ణయంతో ఇతర దేశాలు కూడా యుక్రెయిన్‌కు సాయం చేయడానికి ముందుకొస్తాయని భావిస్తున్నారు.

పోలండ్ 14 లెపర్డ్ ట్యాంక్స్‌ను యుక్రెయిన్‌కు ఇవ్వాలని భావిస్తోంది. కాకపోతే వాటిని జర్మనీలో తయారు చేశారు. అందుకు జర్మనీ ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది.

అమెరికా కూడా తన అబ్రమ్స్ ట్యాంక్ ఇస్తుందని యుక్రెయిన్ భావిస్తోంది.

యుద్ద ట్యాంకులు

చాలెంజర్ ప్రత్యేకత ఏంటి?

బ్రిటన్ చాలెంజర్-2 ట్యాంక్‌కు 20ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇది బ్రిటిష్ సైన్యంలోని కీలక ట్యాంక్. 1990‌ చివరలో తయారుచేసిన ఈ ట్యాంక్ యుక్రెయిన్ యుద్ధభూమిలో అత్యంత ఆధునిక ట్యాంక్ అవుతుంది.

బ్రిటిష్ సైన్యంలోకి 1998లో చేరింది. కాలానుగుణంగా దాన్ని అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నారు.

ఇరాక్ యుద్ధంలోనూ ఈ ట్యాంక్‌ను వాడారు.

ట్యాంక్‌లో ఒక 120 ఎంఎం, రెండు 7.62 ఎంఎం మెషిన్ గన్స్ ఉన్నాయి.

ఒక ట్యాంక్‌లో నలుగురు సైనికులు ఉంటారు.

దీని గరిష్ట వేగం గంటకు 59 కిలోమీటర్లు.

ఉక్రెనియన్ అధ్యక్ష మీడియా కార్యాలయం

యుక్రెయిన్ ఏమంటోంది?

బ్రిటన్ సాయానికి యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ''బ్రిటన్ అందించే సాయం అబేధ్యమైంది. సవాళ్లకు సిద్ధంగా ఉన్నాం. యుద్ధరంగంలో మమ్మల్ని బలోపేతం చేయడమే కాకుండా, ఇతర దేశాలకు సరైన సంకేతాలు పంపినందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు కృతజ్ఞతలు తెలిపాను'' అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

https://twitter.com/ZelenskyyUa/status/1614219544335114242

జెలియన్‌స్కీ, సునాక్ మధ్య జరిగిన చర్చల్లో యుద్ధంలో ఇటీవల యుక్రెయిన్ సాధించిన విజయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో పాటు యుద్ధానికి ప్రపంచ సైనిక, దౌత్య సహకారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

పుతిన్

బ్రిటన్ నిర్ణయంపై రష్యా స్పందనేంటి?

యుక్రెయిన్‌కు చాలెంజర్-2 ట్యాంకులను బ్రిటన్ ఇస్తుండటంపై రష్యా అసంతృప్తి వ్యక్తం చేసింది.

రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా బీబీసీతో మాట్లాడుతూ.. "మేం ముందుగా చెప్పినట్లు యుక్రెయిన్‌కు ఏవైనా ఆయుధాలు సరఫరా చేస్తే అది మాకు చట్టబద్ధమైన లక్ష్యం అవుతుంది" అన్నారు.

బ్రిటన్ నిర్ణయం వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని లండన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.

"సంఘర్షణ జోన్‌లోకి ట్యాంకులు వస్తే యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. పౌరుల మరణాలు కూడా పెరుగుతాయి" అని ఎంబసీ తెలిపింది.

https://twitter.com/AFP/status/1614273386279993346

యుక్రెయిన్‌‌లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో కీవ్, ఖార్కివ్ సహా అనేక నగరాలు రష్యా క్షిపణుల దాడికి గురవుతున్న సమయంలో యుక్రెయిన్‌కు ట్యాంకులు ఇవ్వాలని బ్రిటన్ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Challenger-2: What is special about these battle tanks that Britain will give to Ukraine?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X