వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియా: చైనా డబుల్ గేమ్! పైకి బుజ్జగింపు, లోలోపల ఆయుధాలు సరఫరా!?

చైనా డబుల్ గేమ్ ఆడుతోంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాతో సఖ్యతగా ఉంటున్నట్లు నటిస్తూనే మరోవైపు అమెరికాపైకి ఉత్తరకొరియాను ఉసిగొల్పుతోంది. ఉత్తరకొరియా దుందుడుకు వైఖరి చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: చైనా డబుల్ గేమ్ ఆడుతోంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాతో సఖ్యతగా ఉంటున్నట్లు నటిస్తూనే మరోవైపు అమెరికాపైకి ఉత్తరకొరియాను ఉసిగొల్పుతోంది. ఉత్తరకొరియాకు అవసరమైన అన్నిరకాల సహాయాలూ చేస్తోంది.

ఉత్తరకొరియా దుందుడుకు వైఖరి చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను హెచ్చరించే 'సత్తా' ఉత్తరకొరియాకు ఎలా వచ్చిందనేది ఇతర దేశాల అనుమానం.

చైనా అద్భుత నటన...

చైనా అద్భుత నటన...

ప్రపంచ దేశాల ముందు చైనా అద్భుతంగా నటిస్తోంది. క్షిపణి పరీక్షలు ఆపివేయాలంటూ తానూ ఉత్తరకొరియాకు నచ్చజెప్పి చూశానని, అయినా ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ తమ మాటనూ లెక్కచేయడం లేదంటూ చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు తెగ నాటకం ఆడేస్తున్నారు. ఉత్తరకొరియా తమ మిత్రదేశం కాబట్టి దాని రక్షణ విషయంలో తమకూ బాధ్యత ఉంటుందని, ఒకవేళ అమెరికా గనుక దాడికి దిగితే.. ఉత్తరకొరియా తరుపున తామూ కదన రంగంలో కాలు మోపవలసి వస్తుందంటూ మరోవైపు అమెరికా ముందరి కాళ్లకు బంధం వేస్తోంది చైనా.

ఉత్తరకొరియా ‘సత్తా’ వెనుక చైనా?

ఉత్తరకొరియా ‘సత్తా’ వెనుక చైనా?

అగ్రరాజ్యం అమెరికాను సైతం ఎదిరించే స్థాయికి ఉత్తరకొరియా చేరిందంటే.. దాని వెనుక ఉన్న హస్తం ఎవరిది? ఇప్పుడు ఈ విషయమే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. మొన్నామధ్యన పాకిస్తాన్ తో ఉత్తరకొరియాకు దోస్తీ ఉందని, తమకు కావలసిన అణ్వాయుధ సంపత్తిని అది పాకిస్తాన్ నుంచి సమకూర్చుకుందని మీడియాలో కొన్ని కథనాలు కూడా వచ్చాయి. కానీ నిజానికి ఉత్తరకొరియా ‘సత్తా' వెనుక చైనా హస్తం ఉన్నట్లు తాజాగా వెలుగుచూసింది. ఉత్తరకొరియాకు చైనాయే ఆయుధాలు సరఫరా చేస్తోందని, అందుకే అది అమెరికాను సైతం లెక్కచేయడం లేదని తెలుస్తోంది.

ఉద్రిక్తతలు రాజేస్తోంది డ్రాగన్ కంట్రీయే...

ఉద్రిక్తతలు రాజేస్తోంది డ్రాగన్ కంట్రీయే...

‘ది కమింగ్‌ కొలాప్స్ ఆఫ్ చైనా' పుసక్తం రచయిత, అమెరికా రక్షణ పరిశోధకుడు, తూర్పు ఆసియా భద్రత నిపుణుడు అయిన గోర్డాన్ చాంగ్ చైనాపై తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. అసలు అమెరికా, ఉత్తరకొరియాల నడుమ ఉద్రిక్తతలు రాజేసింది చేనాయే అని, అది ఉత్తరకొరియాకు ఆయుధాలు సరఫరా చేస్తోందంటూ ఆయన వెల్లడించారు. బట్రిరోమో ‘మార్నింగ్ విత్ మరియా'అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చైనా డబుల్ గేమ్ గురించి ప్రస్తావించారు. ఉత్తరకొరియా అణ్వాయుధ సామర్థ్యం వెనుక చైనా హస్తముందని, చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాన్ని అమ్ముకుంటున్నారని గోర్డాన్ చాంగ్ సంచలన ఆరోపణలు చేశారు.

తన స్వార్థం కోసం ఉద్రిక్తతలను పెంచుతూ...

తన స్వార్థం కోసం ఉద్రిక్తతలను పెంచుతూ...

అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని చైనా సొమ్ము చేసుకుంటోందని గోర్డాన్ చాంగ్ పేర్కొన్నారు. ఉత్తరకొరియా అణ్వాయుధ సామర్థ్యం వెనుక చైనా హస్తమే ఉందని, మొన్న జూలైలో జపాన్ మీదుగా నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణుల పరీక్షకు ప్రధాన సామగ్రిని సమకూర్చింది డ్రాగన్ కంట్రీయేనంటూ ఆయన బాంబు పేల్చారు. చైనా సరఫరా చేసిన క్షిపణులను ఇన్నాళ్లూ బంకర్లలో దాచిపెట్టిన ఉత్తరకొరియా ఇప్పుడు వాటిని వరుసగా పరీక్షిస్తూ తన ‘సత్తా'ను ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు చాటే యత్నం చేస్తోందంటూ చాంగ్ మండిపడ్డారు. ఇరు దేశాలతో ఒకేసారి దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించడం ద్వారా చైనా నాటకాలు ఆడుతోందని, ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి.. ఇంకే పెంచే విధంగా చేయాల్సినవన్నీ చేస్తోందని ఆయన ఆరోపించారు.

English summary
Gordon Chang, an East Asia security aficionado has accused Beijing of siding with Pyongyang by transferring “very important” military technologies. He said: "They are weaponising the North.” The expert also disclosed that the rogue state’s recent intercontinental ballistic missile (ICBM) tests on July 4 and 28 were aided by China thanks to Chinese mobile launchers, that allowed the test to take place. He added: "Those mobile launchers make North Korea a real threat because their missiles can now hide.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X