వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు షాకిచ్చిన చైనా: ఇండియాపై నిందలు మానుకో, కానీ, ఆర్మీకి చైనా హెల్ప్..

పాకిస్థాన్‌ను చైనా ఏకిపారేసింది. ప్రతి విషయంలో భారత్‌పై నిందలు వేసే బుద్దిని మానుకోవాలని చైనా పాకిస్థాన్‌కు హితవు పలికింది.500 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై భ

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

China Dismisses Pakistan General's Allegation on India | Oneindia Telugu

బీజింగ్: పాకిస్థాన్‌ను చైనా ఏకిపారేసింది. ప్రతి విషయంలో భారత్‌పై నిందలు వేసే బుద్దిని మానుకోవాలని చైనా పాకిస్థాన్‌కు హితవు పలికింది.500 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై భారత్‌ గూఢచర్యం చేస్తోందన్న పాకిస్తాన్‌ వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది.

డోక్లామ్ ఘటనల తర్వాత భారత్‌కు మద్దతుగా చైనా స్పందించింది. అంతేకాదు పాక్ చేసిన ఆరోపణలను చైనా కొట్టిపారేసింది. అనవసరమైన ఆరోపణలు చేయకూడదని పాకిస్థాన్‌కు చైనా హితవు పలికింది.

అయితే తొలి నుండి పాక్‌కు చైనా అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలు లేకపోలేదు. అయితే తాజా ఘటన మాత్రం పాక్‌కు చుక్కలు చూపించింది. ఈ ఘటన తర్వాత అయినా పాక్ బుద్ది మార్చుకొంటుందో చూడాలంటున్న రాజకీయ విమర్శకులు

 ఇండియాపై ఆరోపణలు మానుకోవాలని సూచన

ఇండియాపై ఆరోపణలు మానుకోవాలని సూచన

500 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై భారత్‌ గూఢచర్యం చేస్తోందన్న పాకిస్తాన్‌ వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది.సీపీఈసీ ప్రాజెక్టును గందరగోళ పరిచేలా వివాదాస్పద ప్రాంతాల్లో భారత్‌ అరాచకత్వాన్ని పెంపొందిస్తోందని పాకిస్తాన్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌ జనరల్‌ జుబిర్‌ మహమ్మద్‌ హయత్‌ నవంబర్‌ 14న ప్రకటించారు. ఈ ఆరోపణలను చైనా కొట్టిపారేసింది.

 బలూచిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న భారత్

బలూచిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న భారత్

బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవావాదాన్ని భారత్‌ పెంపొందిస్తోందని జుబిర్‌ మహమ్మద్‌ హయత్‌ ఆరోపించారు. ఈ ప్రాంతంలో అరాచకాలను పెంచి పోషించేందుకు ఇండియా ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు. ఈ తరహ ఆరోపణలను మానుకోవాలని చైనా సూచించింది.

పాక్ ఆర్మీకి చైనా శిక్షణ

పాక్ ఆర్మీకి చైనా శిక్షణ

పాక్ ఆర్మీని పటిష్టం చేసేందుకు చైనా ముందుకు వచ్చింది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక ది నేషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. నవంబర్ 18వ, తేదిన రెండు దేశాల సైనికాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఆ కథనంలో ప్రస్తావించారు.. ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కునేందుకు ఇరు దేశాల మధ్య సైనిక సహకారంతో పాటు, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరుదేశాల సైనికాధిపతులు నిర్ణయించినట్టు సమాచారం.

 పాక్-చైనా ఎకనామిక్ కారిడార్‌పై చర్చలు

పాక్-చైనా ఎకనామిక్ కారిడార్‌పై చర్చలు

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)పై కూడా కీలక చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఏర్పాటైన జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఇస్లామాబాద్‌లో సమావేశమవుతోంది. మల్టీ బిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న సీపీఈసీ అందుబాటులోకి వస్తే.. పారిశ్రామిక రంగం ఊపందుకోవడంతో పాటు తమ దేశం దశ తిరిగినట్టేనని పాకిస్తాన్ భావిస్తోంది.

English summary
China on Monday dismissed a top Pakistani Army General's allegation that India has established a special intelligence cell at a cost of USD 500 million to sabotage the strategic China-Pakistan Economic Corridor (CPEC), saying it does not have any such report. Chairman of Pakistan's Joint Chiefs of Staff Committee General Zubair Mehmood Hayat on November 14 said had accused India of stoking "chaos and anarchy" in the region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X