చైనాలో ఘోర విమాన ప్రమాదం: 133 మంది ప్రయాణికులతో..కుప్పకూలిన బోయింగ్
బీజింగ్: చైనాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. సంఘటనా స్థలానికి తక్షణమే చేరుకోవడానికి వీలు లేని పర్వత శిఖరం, దట్టమైన చెట్ల మధ్య విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగిలివుండకపోవచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
కుప్పకూలిన చోట మంటలు..
సమాచారం అందుకున్న వెంటనే చైనా ఉన్నతాధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇది. గ్వాంగ్ఝౌ రీజియన్ పరిధిలోని వుఝౌ సిటీ సమీపంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. విమానం కుప్పకూలిన చోటు నుంచి దట్టమైన పొగ వెలువడింది. మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంఘటనా స్థలం మొత్తం భీతావహంగా మారింది.
కున్మింగ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే..
యున్నాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌లో గల ఛాంగ్‌షుయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 133 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఈ బోయింగ్ 737-800 విమానం. యున్నాన్ ప్రావిన్స్ కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 1:11 నిమిషాలకు ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది. గ్వాంగ్ఝౌలోని బైయూన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంది. కున్మింగ్ నుంచి టేకాఫ్ తీసుకున్న గంట తరువాత.. అంటే 2:22 నిమిషాలకు ఈ విమానం రాడార్ సంబంధాలు తెగిపోయాయి.
పర్వతాలపై..
దీనిపై ఈ రెండు విమానాశ్రయాల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందింది. ఆ కొద్దిసేపటికే- టెంగ్ కంట్రీలోని వుఝౌ సిటీ సమీపంలోని పర్వతాలపై ఈ విమానం కుప్పకూలినట్లు సమాచారం అందింది. ఆ వెంటనే ప్రయాదానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్ట్ అయ్యాయి. ఈ ఘటనలో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు. తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకోవడానికి అనువైన మార్గం లేకపోవడం వల్ల సహాయక చర్యలను చేపట్టడంలో జాప్యం ఏర్పడినట్లు సమాచారం.

అంటుకున్న కార్చిచ్చు..
విమానం కుప్పకూలిన ప్రదేశంలో మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాప్తి చెందాయి. చుట్టుపక్కల చెట్లన్నీ మంటల్లో కాలిపోవడం ఈ వీడియోల్లో చూడొచ్చు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగిలివుండే అవకాశం లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ఇంకా ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. సంఘటనా స్థలంలో కనిపించిన భీతావహ దృశ్యాలను బట్టి అంచనా వేస్తోంటే ప్రాణనష్టం అధికంగా ఉంటుందని చైనీస్ మీడియా అభిప్రాయపడింది.

ఆరేళ్ల కిందటి ఫ్లైట్..
వుఝౌ సిటీ సమీపంలో కుప్పకూలిన బోయింగ్ 737-800 విమానం ఆరు సంవత్సరాల కిందటిదిగా తేలింది. ఫ్లైట్ రాడార్ డాట్ కామ్ వెబ్‌సైట్ దీనిపై ఓ కథనాన్ని ప్రచురించింది. 1:11 నిమిషాలకు విమానం ట్రాకింగ్‌ను రికార్డ్ చేసిందా వెబ్‌సైట్. 2:22 నిమిషాల వరకు దాన్ని చూపించగలిగింది. ఆ తరువాత రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో ట్రాక్ చేయలేకపోయామని పేర్కొంది. ఆ కొద్దిసేపటికే ఈ ఫ్లైట్ కుప్పకూలినట్లు సమాచారం అందింది.

2010లో
2010లో చైనాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. నాటి ఘటనలో 44 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో ఆ విమానంలో 96 మంది ప్రయాణికులు ఉన్నారు. హెనన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంబ్రాయిర్ ఈ-190 రీజినల్ జెట్ ఫ్లైట్ అది. ఈచున్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. దాని తరువాత ఆ స్థాయిలో ఘోర దుర్ఘటన ఇదేనని భావిస్తున్నారు. తాజా ఘటనలో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.
unverified video from China wechat pic.twitter.com/ZbiL0vGclP
— Jimmy Wan💙💛 (@kalaka914) March 21, 2022
Final moments of MU5735 reportedly shows the 737 in a steep dive before crashing into terrain in Guangxi Zhuang. pic.twitter.com/Jwf0lWdoI9
— Breaking Aviation News & Videos (@aviationbrk) March 21, 2022
Video from the MU5735 crash site shows very little sign of the 737 as it impacted mountains in China's Guangxi Zhuang Autonomous Region. pic.twitter.com/cO5IROnVXL
— Breaking Aviation News & Videos (@aviationbrk) March 21, 2022
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications