భారత్‌ను పట్టించుకోని చైనా: పీఓకేలో మెగా డ్యాం
న్యూఢిల్లీ/బీజింగ్: ఒక వైపు భారత్ తీవ్ర అభ్యంతరాలను తెలుపున్నా.. చైనా ప్రభుత్వం వాటిని లెక్క చేయకుండా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో 1100 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే భారీ డ్యాంను నిర్మించేందుకు సిద్ధమైంది.
ప్రపంచంలోనే అతి పెద్ద డ్యాంను చైనాలో నిర్మించిన చైనా ప్రభుత్వ రంగ సంస్థ ‘త్రీ గోర్జెస్ కార్పొరేషన్(సిటిజిసి)' పీఓకేలోని కోహల వద్ద జీలం నదిపై ఈ డ్యాంను నిర్మించేందుకు పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేగాక, ఒప్పందంపై సంతకాలు కూడా పూర్తయ్యాయని త్రీ గోర్జెస్ కార్పొరేషన్ గురువారం తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య పీఓకే వివాదాస్పద ప్రాదేశిక ప్రాంతమైనందున అక్కడి ఎలాంటి డ్యాంలు, కారిడార్‌లు నిర్మించరాదని భారత్ తొలి నుంచీ చైనాకు చెబుతూనే ఉంది. అయినా చైనా వాటిని లెక్కచేయడం లేదు.

అంతేగాక, కాశ్మీర్ విషయంలో తాము ఎలాంటి వైఖరిని తీసుకోలేమని, వ్యాపారం నిమిత్తమే పాకిస్థాన్‌లోని ముజఫర్‌నగర్‌కు దిగువన జీలం నదిపై 2.4బిలియన్ డాలర్లతో డ్యాంను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని చైనా ప్రభుత్వం వాదిస్తోంది.
30ఏళ్ల టారిఫ్‌పై చైనా, పాకిస్థాన్ దేశాల మధ్య డ్యాం నిర్మాణానికి అంగీకారం కుదిరిందని పాకిస్థాన్ మీడియా కూడా వెల్లడించింది. కాగా, చైనా తన ఆధీనంలో ఉందని వాదిస్తున్న వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో భారత్, వియత్నాం సంయుక్త ప్రాజెక్టులను చైనా ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని భారత అధికారులు నిలదీశారు. ఇదేమి ద్వంద్వ ప్రమాణాలన్న ప్రశ్నకు చైనా నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
కాగా, ‘న్యూ చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్'లో భాగంగా చైనా ఓ కొత్త డ్యాంను నిర్మిస్తోంది. భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఇప్పటికే ఈ ఎకనామిక్ కారిడార్ కింద చైనా ప్రభుత్వం ‘కారకోరం' రహదారిని విస్తరిస్తోంది. అంతేగాక, పీఓకే మీదుగా పాక్‌లో గ్వాదర్ పోర్టు వరకు చైనా ఇప్పటికే రైల్వే లైన్‌ను నిర్మించి, దాని నిర్వహణ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తోంది.












Click it and Unblock the Notifications