అదే దూకుడు.. సంక్షోభంలోనూ వెనక్కి తగ్గని చైనా.. డిఫెన్స్ బడ్జెట్ ఎంతో తెలుసా..
కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి తెరపడి ఆసియా దేశాలు ప్రపంచంపై పట్టు బిగించే అవకాశాలున్నాయని ఇటీవలి కాలంలో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ముఖ్యంగా చైనా,సింగపూర్,జపాన్ దేశాలు ఆ దిశగా ముందు వరుసలో ఉంటాయని అంటున్నారు. భవిష్యత్తులో ఈ అంచనాలు ఎంతమేర నిజమవుతాయో తెలియదు గానీ.. చైనా మాత్రం అగ్రరాజ్యం అమెరికాను తలదన్నేలా ఆధిపత్యం కోసం ప్రణాళికలు రచిస్తోంది. తాజా కరోనా సంక్షోభం కుదిపేస్తున్న తరుణంలోనూ చైనా తమ రక్షణ రంగానికి నిధులను పెంచడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

రక్షణ రంగ బడ్జెట్‌పై ముసాయిదా బిల్లు
అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రెండో సైనిక వ్యవస్థను కలిగివున్న చైనా.. తాజాగా తమ రక్షణ రంగానికి 6.6శాతం బడ్జెట్‌ను పెంచి 179 అమెరికన్ డాలర్లను కేటాయించాలని నిర్ణయించింది. అయితే వృద్ది రేటు పరంగా ఇది తక్కువే అని చెప్పాలి. గత ఐదేళ్లుగా రక్షణ రంగ కేటాయింపులు డబుల్ డిజిట్ వృద్ది రేటు నుంచి సింగిల్ డిజిట్ వృద్ది రేటుకు పడిపోయాయి. అయినప్పటికీ తాజా కేటాయింపులు భారత్‌తో పోలిస్తే మూడు రెట్లు అత్యధికం. శుక్రవారం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(NPC) ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లులో ఈ వివరాలను పొందుపరిచారు.

అనధికారికంగా చైనా ఇంకా ఎక్కువే ఖర్చు చేస్తోందా..
దాదాపు 20లక్షల మందితో చైనా మిలటరీ శత్రు దుర్భేద్యంగా ఉంది. తాజా ముసాయిదా ప్రకారం చైనా రక్షణ రంగ బడ్జెట్ ఈ ఏడాది 1,27 ట్రిలియన్ యువాన్లు(179 అమెరికన్ డాలర్లు). గతేడాది ఈ కేటాయింపులు 177.76 అమెరికన్ డాలర్లుగా ఉన్నాయి. గత కొన్నేళ్లల్లో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్,న్యూక్లియర్-పవర్డ్ సబ్‌మెరైన్స్ వంటి వాటిని చైనా స్వదేశంలోనే తయారుచేసుకుంది. తాజా బడ్జెట్‌ను మిలటరీ పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. నిజానికి అధికారికంగా బయటకొచ్చిన ఈ లెక్కల కంటే.. చైనా ఇంకా ఎక్కువ మొత్తంలోనే మిలటరీపై ఖర్చు చేస్తోందని విదేశీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video

ఎందుకింత బడ్జెట్..
ఈ సంవత్సరం బడ్జెట్‌తో చైనా నావికాదళాన్ని విస్తరించే యోచనలో చైనా ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై చాలాకాలంగా పట్టు కోసం చూస్తోన్న చైనా.. నావికా దళాన్ని మరింత పటిష్టం చేసే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే పశ్చిమ పసిఫిక్,హిందూ మహాసముద్రంలోనూ తన సైనిక ఉనికిని విస్తరించే యోచనలో చైనా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తైవాన్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అవసరమైతే సైనిక శక్తిని ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో అత్యాధునిక నిఘా వ్యవస్థ రూపకల్పన,యుద్ద విమానాల సంఖ్య పెంపుపై చైనా ఫోకస్ చేసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications