వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: 'పాకిస్తాన్‌లో అణుబాంబు, భారత్‌పై దాడికి సిద్ధంగా చైనా..!'

సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన శతృవు పాకిస్తాన్ కాదని, చైనా అని వ్యాఖ్యానించారు.

భారత్ 'కీలక' నిర్ణయం, అప్పుడే అక్కడ చైనా ఆట!భారత్ 'కీలక' నిర్ణయం, అప్పుడే అక్కడ చైనా ఆట!

చైనా - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ములాయం సింగ్ బుధవారం మాట్లాడారు. చైనా ఇప్పటికే పాకిస్తాన్‌లో అణుబాంబును (న్యూక్లియర్) ఉంచిందని, భారత్ పైన దాడి చేసేందుకు సిద్ధమవుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

చైనా నుంచి ప్రమాదం

చైనా నుంచి ప్రమాదం

ప్రస్తుతం భారత్‌కు చైనా నుంచి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ములాయం చెప్పారు. పాకిస్తాన్‌ను ఉపయోగించుకొని చైనా మన దేశం పైన కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు.

పాకిస్తాన్‌లో అణుబాంబు.. భారత్‌పై దాడి చేసేందుకు..

పాకిస్తాన్‌లో అణుబాంబు.. భారత్‌పై దాడి చేసేందుకు..

నాకు తెలిసిన సమాచారం మేరకు పాకిస్తాన్‌లో చైనా న్యూక్లియర్ బాంబును ఉంచిందని, భారత్ పైన దాడి చేసేందుకు సిద్ధమవుతోందని చెప్పారు.

అది మన బాధ్యత

అది మన బాధ్యత

భూటాన్, సిక్కింలను చైనా నుంచి కాపాడటం మన (భారత్) బాధ్యత అని ములాయం సింగ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ కంటే చైనానే మన పెద్ద శత్రువు అని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా హెచ్చరిక

చైనా హెచ్చరిక

చైనా - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. డొక్లామ్ భారత్ సైన్యం వెనక్కి వెళ్లకుంటే యుద్ధానికైనా సిద్ధమని చైనా, ఆ దేశ మీడియా హెచ్చరికలు జారీ చేస్తోంది. అంతేకాదు, భారీగా సైన్యాన్ని, మిలటరీ ఆయుధాలను, పరికరాలను టిబెట్‌కు తరలించినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది.

English summary
Samajwadi Party MP Mulayam Singh Yadav on Wednesday claimed that China has installed the nuclear bomb on Pakistan soil and is fully prepared to attack India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X