వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లోని చైనీయులూ! జాగ్రత్త: చైనా సిద్ధమవుతోందా?

సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశంలోని చైనీయులు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశం హెచ్చరికలు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశంలోని చైనీయులు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశం హెచ్చరికలు జారీ చేసింది. వ్యక్తిగత భద్రతను చూసుకోవాలని కోరింది. స్థానికంగా ఇబ్బందికరంగా ఉంటే తమకు తెలియజేయాలని తెలిపింది.

సిద్ధమవుతోందా?

సిద్ధమవుతోందా?

జులై 7న భారత్‌లోని చైనీయులను ఉద్దేశించి ఈ మేరకు న్యూఢిల్లీలోని తన ఎంబసీకి చైనా ప్రభుత్వం ఓ నోటీసును పంపింది. ఈ నేపథ్యంలో చైనాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా ఏమైనా యుద్ధానికి సిద్ధమవుతోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

సిక్కిం స్వాతంత్య్రానికి మద్దతిస్తాం: చైనా మీడియా బరితెగింపుసిక్కిం స్వాతంత్య్రానికి మద్దతిస్తాం: చైనా మీడియా బరితెగింపు

మోడీతో భేటీకి ముందే.

మోడీతో భేటీకి ముందే.

కాగా, జీ20 సదస్సులో భారత ప్రధాన నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశానికి ముందే ఇది జరగడం గమనార్హం. ఇరు దేశాల నేతలు సదస్సులో వ్యక్తిగతంగా కలుసుకోకపోయినప్పటికీ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం తెలిసిందే. బ్రిక్స్‌లో తమ తమ పాత్రలపై కొనియాడుకున్నారు.

షాక్: జీ20 సదస్సులో మోడీ, జిన్‌పింగ్ ఒకరిపై ఒకరు ప్రశంసలు షాక్: జీ20 సదస్సులో మోడీ, జిన్‌పింగ్ ఒకరిపై ఒకరు ప్రశంసలు

భారత్‌కు పెరిగిన చైనీయుల రాక

భారత్‌కు పెరిగిన చైనీయుల రాక

కాగా, 2003లో 21,152మంది భారతదేశాన్ని సందర్శించగా.. ఆ సంఖ్య 2013కు 1లక్షలకు చేరిందని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అంతేగాక, చైనా జాతీయులకు చెందిన పలు కంపెనీలు కూడా భారతదేశంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపింది.

కొనసాగుతున్న ఉద్రిక్తత

కొనసాగుతున్న ఉద్రిక్తత

భూటాన్, భారతదేశానికి చెందిన సరిహద్దు ప్రాంతంలో చైనా తన భద్రతా దళాల సాయంతో రోడ్డు నిర్మాణం చేపడుతుండటంతో భారత భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. భూటాన్‌కు మద్దతుగా చైనా దళాలను వెనక్కిపంపించేందుకు జూన్ 16 నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా, చైనా దళాలు వెనక్కి దగ్గకపోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పలుమార్లు చైనా, భారత్ దళాల మధ్య తోపులాట కూడా చోటు చేసుకోవడం గమనార్హం.

English summary
Amidst the stand off, China has issued a travel advisory to all its nationals in India. The notice issued to the Chinese nationals in India asks them to pay close attention to their personal safety and local security situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X