వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాగొద్దు: డొనాల్డ్ ట్రంప్‌కు చైనా సంపన్నుడి హెచ్చరిక

అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా అత్యంత సంపన్నుడు వాంగ్ జియాలిన్ బుధవారం నాడు హెచ్చరికలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా అత్యంత సంపన్నుడు వాంగ్ జియాలిన్ బుధవారం నాడు హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ విధానాల పైన ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వాంగ్ జియాలిన్ చైనా వ్యాపారి మాత్రమే కాకుండా హాలీవుడ్ ఇన్వెస్టర్.

ట్రంప్‌ వాణిజ్య యుద్ధాన్ని తప్పుబట్టారు. వినోద పరిశ్రమను ట్రేడ్ వార్‌లోకి లాగడాన్ని నిరసించారు. అమెరికాలోని లక్షలమంది సినీ ప్రేమికుల చేతుల్లో చిత్రపరిశ్రమ భవిష్యత్తు ఉందని చెప్పారు. ఆయన దావోస్‌ నిర్వహిస్తున్న ఎకనామిక్‌ ఫోరం సదస్సులో మాట్లాడారు.

<strong>మాకు నీతులు చెప్పొద్దు: అమెరికా మీడియా, తప్పట్లేదని ట్రంప్</strong>మాకు నీతులు చెప్పొద్దు: అమెరికా మీడియా, తప్పట్లేదని ట్రంప్

China's richest man Wang Jianlin warns Donald Trump against trade war

వాంగ్‌ అమెరికాలో సినిమా చైన్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఆయన సంస్థ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ను ఇస్తుంది. ఈ సందర్భంగా వాంగ్‌ మాట్లాడారు. ఒకవేళ అమెరికా వినోద పరిశ్రమ ఈ యుద్ధంలోకి దిగితే తీవ్రంగా నష్టపోయి బాధితురాలిగా మిగులుతుందన్నారు.

ఆమెరికా బయట ఇంగ్లీష్ చిత్రపరిశ్రమ వేగంగా ఎదుగుతోంది చైనాలోనేనని చెప్పారు. గత ఏడాది ఒక్క చైనాలోనే దాదాపు 15,000 కొత్త స్క్రీన్‌లు ఏర్పాటు చేశారని, ఇప్పటికే చైనాలో అత్యధిక సినిమా స్క్రీన్‌లు ఉన్నాయన్నారు. చైనా నుంచి కూడా ప్రతిఘటన ఉంటే ఇరుపక్షాలు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి పరిస్థితిని తాను చూడకూడదని భావిస్తున్నట్లు చెప్పారు.

English summary
China's richest man, Hollywood investor Wang Jianlin, warned Mr Donald Trump on Wednesday against dragging the entertainment industry into a trade war saying his country's millions of movie-lovers are key to the future of cinema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X