పాక్‌కు అండ, 30 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు: భారత్‌పై చైనా పావులు, మోడీ కంటే ఎక్కువే

ఢాకా: చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ శుక్రవారం బంగ్లాదేశ్ చేరుకున్నారు. మూడు దశాబ్దాల అనంతరం బంగ్లాలో అడుగుపెట్టిన తొలి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కావడం గమనార్హం. దౌత్యపరంగా ఇది మరో మైలురాయి అని చైనా ఈ సందర్భంగా పేర్కొంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి.

బంగ్లాదేశ్‌తో బంధాలు బలపరుచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఆ దేశానికి 24 బిలియన్‌ డాలర్ల విలువ చేసే రుణాలు ఇచ్చేందుకు చైనా అంగీకరించనుంది. భారత్‌ బంగ్లాదేశ్‌కు ఇటీవల 2 బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. చైనా ఏకంగా 24బిలియన్‌ డాలర్లు ఇవ్వనుంది. త్వరలో ఈ ఒప్పందంపై చైనా సంతకాలు చేయనుంది. భారీ మొత్తంలో రుణాలు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్‌ను వ్యూహాత్మకంగా తమకు దగ్గర చేసుకోవాలని చైనా భావిస్తోంది.

China

భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాను ఆకట్టుకునే యత్నం

భారత్‌-పాకిస్తాన్ వివాదాల నేపథ్యంలో భారత్‌కు మద్దతిస్తున్న బంగ్లాదేశ్‌ను చైనా ఆకట్టుకునే యత్నం చేస్తుండడం గమనార్హం. జీ జిన్ పింగ్‌ బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా చైనా పలు కీలక ఒప్పందాలు చేసుకుంటుంది. బంగ్లాదేశ్‌లో పవర్‌ ప్లాంట్లు, పోర్టు, రైల్వేలు తదితర మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులు పెట్టనుంది.

భారతదేశం నుంచి సహాయం పొందిన జపాన్‌ కూడా బంగ్లాదేశ్‌కు సహాయపడడానికి ముందుకొచ్చింది. విమానాశ్రయం, పవర్‌ కాంప్లెక్స్‌ కట్టుకోవడానికి బంగ్లాదేశ్‌కు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని తెలిపింది. బంగ్లాదేశ్‌లో చైనా దాదాపు 25 ప్రాజెక్టులకు సహాయం చేస్తోందని బంగ్లాదేశ్‌ ఆర్థిక మంత్రి ఎంఏ మన్నాన్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌లో జీ జిన్‌పింగ్‌ పర్యటన కొత్త మైలురాయి కానుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+