టూరిస్ట్ బస్సు దగ్ధం: 35మంది సజీవ దహనం(వీడియో)
బీజింగ్: చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టూరిస్టు బస్సు రోడ్డు సైడ్‌వాల్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 35 మంది సజీవదహనమయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యచైనాలోని హునాన్ రాష్ట్రంలో ఆదివారం ఈ ఘటన సంభవించింది. 55 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు గువాడ్రయిల్స్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఆయిల్ లీక్ కావడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి.

గాయపడిన 11 మందికి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
బస్సు ప్రమాదానికి గురికావడంతో దట్టమైన పొగ వ్యాపించి.. బస్సులో నుంచి ప్రయాణికులు ప్రయాస పడుతూ బయటకు వస్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.












Click it and Unblock the Notifications