వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో వింత శిశువు : 31 వేళ్లతో జననం

|
Google Oneindia TeluguNews

జన్యుపరమైన లోపాలతో వింత శిశువులు జన్మించడం తరచూ వార్తల్లో కనిపించేదే. అయితే ఈ కారణంగా కొందరు అవయవ లోపంతో జన్మిస్తే, మరికొందరు చిన్నారులు అదనపు అవయవాలతో జన్మిస్తుంటారు. తాజాగా చైనాలోని ఓ చిన్నారి కూడా కాళ్లు, చేతులకు అదనపు వేళ్లతో జన్మించాడు. ఒకటి, రెండు ఎక్కువ వేళ్లతో జన్మించడం సాధారణమైన విషయమే అయినప్పటికీ ఈ చిన్నారి మాత్రం చేతులకు 15 వేళ్లు, కాళ్లకు 16 వేళ్లతో జన్మించడం ఆసక్తికరంగా మారింది.

ఈ ఏడాది జనవరిలో జన్మించిన చిన్నారి హాంగ్ కాంగ్ 'పాలీ డాక్టలిజమ్' అనే కారణంగా ఇలా అదనపు వేళ్లతో జన్మించినట్టుగా వైద్యులు తెలిపారు. చైనాలోని హునన్ రాష్ట్రంలోని పింగ్ జాంగ్ జిల్లాలో జన్మించిన ఈ చిన్నారిని చూడడానికి అక్కడి జనం ఆసక్తి కనబరుస్తున్నారు.

Chinese boy born with 31 fingers and toes

దీనిపై మరిన్ని విషయాలు తెలియజేసిన డాక్టర్లు.. ప్రతీ వెయ్యి మందిలో ఒకరు ఈ విధంగా జన్మిస్తారని చెప్పారు. హాంగ్ కాంగ్ జన్మించి ఇప్పటికీ నాలుగు నెలలు కావస్తుండగా, ఆ చిన్నారి తల్లి చేతులకు కాళ్లకు కూడా ఆరు వేళ్లు చొప్పున ఉన్నాయని చెప్పారు. తల్లి నుంచి జన్యుపరమైన లక్షణాలు సంక్రమించడం వల్లే, హాంగ్ కాంగ్ అదనపు వేళ్లతో జన్మించాడని చెప్పుకొచ్చారు డాక్టర్లు.

చిన్నారి హాంగ్ కాంగ్ గురించి మాట్లాడిన తల్లిదండ్రులు.. సమస్యపై పరిష్కారం కోసం వైద్యుల సలహా తీసుకుంటున్నామన్నారు. ఇంత చిన్న వయసులో చిన్నారికి సర్జరీ చేసి అదనపు వేళ్లు తొలగించడమన్నది కష్టంతో కూడుకున్నదే గాక ఖర్చుతో కూడుకున్నదని, ఆపరేషన్ చేయించేంత ఆర్థిక స్తోమత కూడా తమకు లేదన్నారు. చిన్నారి సర్జరీ కోసం దాతల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, దాతలెవరైనా సహాయం చేయాల్సిందిగా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Doctors diagnosed Hong Hong with polydactylism, a congenital condition that happens in humans, dogs and cats, giving them extra fingers and toes. Polydactyly is a pretty common condition, affecting about one in every 1,000 live births, according to Children’s Healthcare of Atlanta. Often, the extra digits are removed surgically. Hong Hong’s parents are trying to raise enough money so their son can undergo the life-changing operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X