వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారని డ్రాగన్: అరుణాచల్ గుండా రహదారి, నిర్మాణాలు..

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ తన బుద్ది మాత్రం మార్చుకోవడం లేదు. పైకి చర్చలు అంటూనే.. చేయాల్సి చేస్తోంది. తూర్పు లడాఖ్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇటు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల గుండా కూడా వసతుల కల్పనపై ఫోకస్ చేసింది. ఇందుకు సంబంధించి చర్యలు కూడా తీసుకుంటుంది. మరోవైపు భారత్ కూడా తవాంగ్ సెక్టార్ వద్ద మిలిటరీ పోస్టులు ఏర్పాటు చేసి.. రక్షణను మరింత బలోపేతం చేశారు. చైనా కూడా ఆసపిల్లా ఏరియాలో కూడా రక్షణను పటిష్టం చేసినట్టు తెలుస్తోంది.

ఆర్ఏఎల్పీ వద్ద చేసిన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఆ పరిసరాల్లో చైనాకు చెందిన బలగాలు సంచరించిన గుర్తులు ఉన్నాయి. టెంట్లు కూడా కనిపించాయి. అంతేకాదు ఆ పరిసరాలకు రహదారిని కూడా నిర్మించుకున్నారని భారత అధికారి ఒకరు వివరించారు. తూర్పు, పశ్చిమ కామెంగ్ జిల్లాల్లో ఆర్మీ, ఆర్ఎఎల్పీ మొహరించిన పరిస్థితి ఉంది. లొహిత్, సియాంగ్ నుంచి రెండు విధాలుగా వెళ్లే రహదారి అందుబాటులో ఉంది. దానిని వారు మరింత ఆధునీకరించారు.

 Chinese build-up in RALP area matter of concern: officers

ఎల్ఏసీ, ఆర్ఎఎల్పీ వద్ద చైనా తన బలగాలను తరలిస్తోంది. అందుకోసం రహదారులు, టన్నెల్, ఇతర మౌలిక వసతుల సదుపాయాల కల్పన చేపట్టింది. చైనా బలగాల మొహరింపు అంశాన్ని ప్రముఖ జర్నలిస్టులు కూడా ధృవీకరించారు. గతేడాది తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. భారత జవాన్లు- చైనా జవాన్ల మధ్య భౌతిక దాడి జరిగింది. భారత కల్నల్ సహా 20 మంది జవాన్లు చనిపోయారు. చైనాకు చెందిన జవాన్లు చనిపోయిన.. డ్రాగన్ ప్రపంచానికి తెలియనీయలేదు.

ఇప్పుడు రహదారి నిర్మించి.. మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. వివిధ సదస్సులలో చర్చలు జరుపుతూనే.. మరోవైపు తన వైఖరిని తెలియజేస్తోంది చైనా. ఇదీ కాస్త ఆందోళన కలిగించే ఇష్యూగా మారింది.

English summary
Tawang sector of Arunachal Pradesh, the massive Chinese infrastructure development and troop build-up in the Rest of Arunachal Pradesh area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X