వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తాజా' గాలిని చైనాలో అమ్ముకుంటున్న కెనడా కంపెనీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: కెనడాకు చెందిన కంపెనీ పర్వతాల నుంచి తాజా గాలిని సేకరించి, బాటిళ్లలో నింపి దానిని చైనాలో అమ్ముతోంది. చైనాలో వాతావరణ కాలుష్యం తీవ్రంగా ఉంది. ఆ పరిస్థితిని కెనడాలోని ఓ స్టార్టప్ కంపెనీ సొమ్ము చేసుకుంటోంది.

కెనడా కంపెనీ తమ దేశంలో పర్వత ప్రాంత నగరమైన బాన్ఫ్, లేక్ లూయిస్ పర్వతాల నుంచి తాజా గాలిని సేకరించి, దానిని చైనాకు ఎగుమతి చేస్తోంది. ఈ కంపెనీ పేరు విటాలిటీ ఎయిర్. ఒక్కో బాటిల్‌ను 28 డాలర్లకు విక్రయిస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం బీజింగ్ కాలుష్యంపై రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Chinese buy up bottles of fresh air from Canada

దీనిని కెనడాకు చెందిన విటాలిటీ ఎయిర్ సొమ్ము చేసుకుంటోంది. ప్రీమియం, నార్మల్ పేరిట రెండు రకాల ఆక్సిజన్ బాటిళ్లను విక్రయిస్తోంది. లేక్ లూయిస్‌లో నింపిన ప్రీమియం ఎయిర్ బాటిల్ ధరను 28 డాలర్లుగా, బాన్ఫ్ గాలి ధర 23.99 డాలర్లు నిర్ణయించింది.

తొలి విడతగా తాము తెచ్చిన అయిదు వందల బాటిళ్లన్నీ రెండు వారాల్లో అమ్ముడు పోవడంతో ఈ-కామర్స్ వెబ్ సైట్ 'తావోబావ్'లో అమ్మకానికి ఉంచింది. ఇవి నిమిషాల్లో అన్నీ అయిపోయాయని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, త్వరలో భారత్‌లోను ఇదే పరిస్థితి వస్తుందని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

English summary
Bottles of FRESH AIR from Canada are a hot sale in China as pollution levels remain high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X