వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా 'డాగ్‌ మీట్‌ ఫెస్టివల్‌'పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన(వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణ చైనాలోని గుయాంగ్జి ప్రావిన్స్‌లోని యులిన్ పట్టణంలో ప్రతి ఏడాది 'డాగ్‌ మీట్‌ ఫెస్టివల్‌'ను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫెస్టివల్‌పై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అందుకు కారణం ఈ ఫెస్టివల్‌లో దాదుపు 10,000 శునకాలను చంపి వాటి మాంసం వండుకొని తింటారు.

చైనాలోశునకాలను చంపి తినడం అనేది చట్టవిరుద్ధమైన పని కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ఆచారాల్లో ఇదొక భాగంగా అక్కడి ప్రజలు భావిస్తుంటారు. చైనాలో జంతు ప్రేమికులు మాత్రం ఈ ఫెస్టివల్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారు.

Chinese dog-eating festival outrages foreigners

కానీ, ఈసారి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు సోషల్ మీడియాను వేదికగా శునకాలను హింసించడం అతి దారుణమని, చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనా సోషల్‌మీడియా సైట్‌ వైబోలో '#StopYulin2015' పేరుతో హాష్‌ట్యాగ్‌ పెట్టి జంతు ప్రేమికుల వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు.

కొందరు తమ పెంపుడు శునకాలతో ఫొటోలు పెట్టి జంతువులను ప్రేమించమని చెప్తున్నారు. అమెరికా సంయుక్త జంతు సంక్షేమ సమూహం డు డు change.org petition ఈ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా రెండు లక్షల మంది నుంచి సంతకాలు తీసుకుంది. ఇదే గ్రూపు శునకాలకు సంబంధించిన వీడియోని యూట్యూబ్‌లో ఉంచగా, దానిని 130,000 మంది వీక్షించారు.

English summary
Outrage on social media over an annual dog-eating festival in China has been growing every year - and this year it's trended across the world. Will the anger eventually end the practice of eating dog meat in China?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X