వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Marsపై చైనా రోవర్ ల్యాండింగ్ సక్సెస్ - ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ - ఈ చిట్టి రోవర్ ఏం చేస్తుంది..?(వీడియో)

|
Google Oneindia TeluguNews

బీజింగ్: అంగారకుడిపై తమ దేశంకు చెందిన రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని చైనా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. దీంతో అరుణ గ్రహంపై రోవర్ ల్యాండ్ చేయించిన రెండో దేశంగా చైనా అవతరించింది. ఈ రోవర్ పేరు జురాంగ్. చైనా పురాణాల ప్రకారం జురాంగ్ అంటే అగ్ని దేవుడని అర్థం. జురాంగ్ అనే ఈ రోవర్ శనివారం ఉదయం ముందస్తు వ్యూహం ప్రకారమే ఎక్కడైతే రోవర్‌ను ల్యాండ్ చేయాలని భావించారో అక్కడే మార్స్‌పై ల్యాండ్ అయినట్లు చైనా ప్రభుత్వ మీడియా స్పష్టం చేసింది. దీంతో గతేడాది కరోనా వైరస్ గురించి చైనా వార్తల్లో నిలవగా ఈ ఏడాది తొలి భాగంలో అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచింది.

Recommended Video

China Mars Mission : అంగారకుడిపై రోవర్ Historic Landing | Zhurong ఏం చేస్తుంది ? | Oneindia Telugu
 అంగారకుడిపై జురాంగ్ రోవర్

అంగారకుడిపై జురాంగ్ రోవర్

ఆరు చక్రాలు కలిగి ఉన్న జురాంగ్ బరువు 240 కిలోగ్రాములు ఉండగా... ఇది ఆరు సెంటిఫిక్ పరికరాలను తనతో మోసుకెళ్లింది. ఇక కొన్ని రోజుల తర్వాత మూడు నెలల మిషన్ కోసం ల్యాండర్ దీన్ని మోహరిస్తుంది. ఈ మిషన్‌లో భాగంగా అంగారకుడి ఉపరితలంపై పురాతన జీవనంపై ఆధారాల కోసం అన్వేషిస్తుంది. ఈ మిషన్ అమలు చేసే సమయంలో తియాన్వేన్ -1 ఆర్బిటార్ నుంచి రోవర్‌కు సంకేతాలు అందుతాయి. దీని ఆధారంగా చేసుకుని అంగారక గ్రహంను మొత్తం చుట్టేస్తుంది. ఇక అంగారకుడి కక్ష్యలో ప్రోబ్ మూడు నెలల పాటు సంచరించి ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కనుగొన్నాకే రోవర్‌ను అంగారక గ్రహం పై విడుదల చేసింది.

అనుకున్న ప్రదేశంలోనే ల్యాండింగ్

తియాన్వేన్-1 ఆర్బిటార్‌ను లాంగ్‌ మార్చ్ 5 రాకెట్ ద్వారా గతేడాది జూన్ 23వ తేదీన నింగిలోకి పంపారు. ఇందుకు వేదికగా హైనాన్‌లోని వెన్‌చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నిలిచింది. మార్స్‌ పైకి చేరేందుకు 7 నెలల సమయం తీసుకుంది. ఆ తర్వాత కక్ష్యలోకి ఈ ఏడాది ఫిబ్రవరి ప్రవేశించింది. ఇక మిలియన్ కిలోమీటర్ల కంటే దూరంలో ఉండగానే మార్స్‌ గ్రహంకు సంబంధించిన ఫోటోను భూమికి పంపింది. కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ప్రోబ్ ముందుగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తుందని ఆ తర్వాత రోవర్‌ను విడుదల చేస్తుందని తియాన్వేన్ -1 పై పనిచేస్తున్న శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అన్నట్లుగానే ఎక్కడా పొరపాటు జరగకుండా ప్రోబ్ రోవర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయించింది.

 గతేడాది అంగారకుడిపై మూడు ప్రయోగాలు

గతేడాది అంగారకుడిపై మూడు ప్రయోగాలు

గతేడాది వేసవి కాలంలో మొత్తం మూడు మిషన్లను అంగారకుడిపైకి వెళ్లిన వాటిలో తియాన్వేన్ -1 ఒకటిగా నిలిచింది. గతేడాది ఫిబ్రవరిలో నాసాకు చెందిన పర్‌సెవరెన్స్ రోవర్ అంగారకుడిపై ల్యాండ్ కాగా, యూఏఈకి చెందిన హోప్ ప్రోబ్‌ కూడా గతేడాది ఫిబ్రవరిలో అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది.అయితే అమెరికా చైనా మిషన్‌లా, యూఏఈ ప్రయోగం అంగారకుడిపై ల్యాండ్ చేయించే ఉద్దేశం కాదు. కేవలం అంగారకుడి గురించి స్టడీ చేయడం కోసమే ప్రయోగించారు. మూడు ప్రయోగాలు ఇంచుమించు ఒకే సమయంలో జరిగాయి. ఇందుకు కారణం భూమి మరియు అంగారక గ్రహం ఒకేసారి సూర్యుడికి మరోవైపు రావడంతో అదే సరైన సమయంగా భావించి ఆయా దేశ శాస్త్రవేత్తలు ప్రోబ్‌లను నింగిలోకి పంపారు. అంతేకాదు ఆ సమయంలో స్పేస్ క్రాఫ్ట్ అరుణ గ్రహం చేరేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
China's Rover made a succesfull landing on Mars stated Chinese state media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X