పాకిస్తాన్ చేతిలో భారత్ గుట్టు ? చైనా భారీ కుట్ర-అయినా చేతులేత్తేసిన వైనం..!

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముమ్మరంగా సాగుతున్న వేళ పాకిస్తాన్ విదేశాల సాయంతో కుట్రలకు తెరలేపింది. ముఖ్యంగా భారత్ పై ప్రతిదాడులు చేసేందుకు వీలుగా మన ఎయిర్ బేస్ లు, రక్షణ స్థావరాలు, ఇతర కీలక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టింది. ఇందులో మిత్రదేశం చైనా వారికి సాయం చేసింది. దీంతో భారత్ లో టార్గెట్ లను ఫిక్స్ చేసుకుని డ్రోన్లను పంపినట్లు రక్షణశాఖకు చెందిన ఓ రీసెర్చ్ టీమ్ గుర్తించింది.

భారత్ లో ఆపరేషన్ సింధూర్ లో పోరాటం చేస్తున్న పాకిస్తాన్ కు ఆయుధ రక్షణ వ్యవస్థలతో పాటు ఉపగ్రహ సమాచారాన్ని సైతం చైనా అందించినట్లు రక్షణ శాఖ అధ్యయనంలో తేలింది. దీన్ని బట్టి భారత్-పాక్ పోరులో చైనా క్రియాశీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. భారత బలగాల మోహరింపులు, ఆయుధాలను గుర్తించేందుకు పాకిస్తాన్ రాడార్లు, ఆయుధ రక్షణ వ్యవస్థలకు చైనా ఉపగ్రహ సాయం అందించిందని తమ అధ్యయనంలో తేలినట్లు రక్షణశాఖకు చెందిన సెంటర్ ఫర్ జాయింట్ వార్ ఫేర్ స్టడీస్ తెలిపింది.

Chinese satellite support to Pakistan during operation sindoor says Indian defence research group

అంతే కాదు పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి మధ్యన 15 రోజుల వ్యవధిలో చైనా తమ శాటిలైట్ల కవరేజ్ ను పెంచడం ద్వారా భారత్ లో లక్ష్యాల సమాచారాన్ని పాకిస్తాన్ కు అందించినట్లు తెలుస్తోంది. తద్వారా బారత బలగాల కదలికల్ని పాకిస్తాన్ ముందే తెలుసుకునేలా చేసిందని డిఫెన్స్ గ్రూప్ వెల్లడించింది. వాస్తవానికి చైనా పాకిస్తాన్ కు ఫైటర్ జెట్లు, మిసైళ్లు మాత్రమే ఇచ్చిందని ముందుగా భావించినా లాజిస్టిక్, నిఘా సమాచారం కూడా ఇచ్చిందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తద్వారా తన ఆయుధాల్ని, శాటిలైట్లు, ఇతర నైపుణ్యాల్ని భారత్-పాక్ యుద్దంలో పరీక్షించినట్లయింది.

అయితే పాకిస్తాన్ ఈ పోరులో చైనా సాయం తీసుకుని మరీ లక్ష్యాల్ని శాటిలైట్ ద్వారా గుర్తించి వందల కొద్దీ డ్రోన్లు ప్రయోగించినా చివరకు అవి మన ఎస్-400, ఎల్ 70 వ్యవస్థల ధాటికి తట్టుకోలేక కుప్పకూలాయి. కానీ చైనా తయారీ J-10C ఫైటర్,PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి వంటి ఆయుధాలు తొలిసారి పరీక్షించడంతో వీటి వాడకంపై తైవాన్ సహా ఇతర డ్రాగన్ ప్రత్యర్థుల్ని ఆందోళన పెంచుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+