‘ప్రభుత్వ కొలువా? లేక రెండో బిడ్డా’: చైనాపై విమర్శలు
బీజింగ్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా జనాభా నియంత్రణకు కఠిన చట్టాలు అమలు చేస్తోంది. అయితే అవి దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా మారుతున్నాయి. ఎలాగంటే.. చైనా తమ దేశ దంపతులు ఒక్క బిడ్డను మాత్రమే కనడానికి అనుమతిచ్చింది.
రెండో బిడ్డకు జన్మనివ్వాలనుకుంటే ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే దానిని వదులుకోవాల్సిందే. ఈ రెండింటిలో ఏది కావాలో మహిళలు తేల్చుకోవాలని చైనా చట్టం రూపొందించింది.

దీనిపై చైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చైనా జనాభా విధానంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో తన భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉండటంతో ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న 41 ఏళ్ల మహిళ గర్భస్రావం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా, బిడ్డను కోల్పోవద్దని భర్తకు ఉద్యోగం పోతే తాము ఇస్తామని ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఆ దంపతుల పట్ల ప్రభుత్వం జాలి చూపించాలని మరికొందరు మానవతావాదులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చైనా జనాభా పాలసీపై ఆ దేశ మెజార్టీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి చట్టాలు ప్రభుత్వం తీసుకురావడం మంచిది కాదని పేర్కొంటున్నారు. ఈ పాలసీని రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications