కిడ్నాప్ చేసింది వీరే, పేర్లు వెల్లడించిన చోక్సీ లాయర్లు.. బెయిల్‌పై రేపు విచారణ
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టి పారిపోయిన మెహుల్ చోక్సీ.. ఎట్టకేలకు డోమినికాలో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే తనను పోలీసులు అపహరించారని.. తర్వాత చిత్రహింసలకు గురిచేశారని చోక్సీ ఆరోపించారు. దీంతో ఆంటిగ్వా, బార్బుడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్‌నకు సంబంధించి చోక్సీ లాయర్లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం స్పందించింది.

తప్పు చేసి ఉంటే..
కిడ్నాప్ చేసిన వారి పేర్లను చోక్సీ లాయర్లు మీడియాకు తెలియజేశారని 'ఆంటిగ్వా న్యూస్ రూమ్' తెలియజేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. నిజంగా వారు అలా చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ స్పష్టంచేశారు. చోక్సీ విషయంలో దర్యాప్తును సీరియస్‌గా తీసుకొని.. వేగంగా సాల్వ్ చేయాలని పోలీసులకు బ్రౌన్ స్పష్టంచేశారు. ఆంటిగ్వాలో చోక్సీని కిడ్నాప్ చేసి.. డోమినికా తీసుకెళ్లారని ఫిర్యాదు అందిందని.. దానిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.

అంత త్వరగా ఎలా..?
డోమినికా ప్రతిపక్ష నేత లెనాక్స్ లింటన్ మాత్రం.. మే 23వ తేదీన ఆర్నె నుంచి యాట్‌లో తీసుకొచ్చారని పేర్కొన్నారు. అయితే దీనిని చోక్సీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం కొట్టిపారేస్తున్నారు. 4, 5 గంటల్లో 120 మైళ్లు చేరుకోవడం కష్టం అని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే డోమినికా హైకోర్టులో చోక్సి బెయిల్ పిటిషన్ వాదనలు రేపు జరగనున్నాయి. చీఫ్ మేజిస్ట్రెట్ బెయిల్ నిరాకరించడంతో.. హైకోర్టును ఆశ్రయించారు.

14 వేల కోట్లు ఎగనామం
చోక్సీ, అతని మేనల్లుడు పీఆన్బీ నుంచి 14 వేల కోట్ల రుణం తీసుకొని ఎగవేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చోక్సీ ఆంటిగ్వా వెళ్లిపోగా.. నీరవ్.. లండన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. చోక్సీని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది. దీనిపై డోమినికా కోర్టు స్టే విధించింది. బుధవారం వరకు అప్పగించడంపై స్టే విధించింది. దీంతో భారత సర్కార్.. చోక్సీని తీసుకొచ్చే పత్రాలు పంపి.. ఇండియా తీసుకొచ్చే యత్నాల్లో ఉంది. డోమినికా నుంచి నేరుగా భారత్ తీసుకురావాలని అనుకుంటుంది. పొరపాటున ఆయన ఆంటిగ్వా వెళితే.. చోక్సీకి.. చట్టపరమైన, రాజ్యాంగ రక్షణ దక్కనున్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications