60 ఏళ్ల క్రితం హిమాలయాల్లో వదిలిన అణు పరికరం.. గంగానదికి పెను ముప్పు..!
హిమాలయాల్లోని పర్వతశ్రేణుల్లో నందాదేవి పర్వతం ఒకటి. ఇది భారత్ కు చెందిన రెండో ఎత్తయిన పర్వతం. నందాదేవి పర్వతంపై 60 ఏళ్ల క్రితం అమెరికా సైన్యం విడిచిపెట్టి వెళ్లిన న్యూక్లియర్ డివైజ్(అణు పరికరం) ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ అణు పరికరం కారణంగా పవిత్రమైన గంగానదికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఈ వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.
1965 లో కోల్డ్ వార్ ఉద్ధృతంగా జరుగుతున్న రోజులు.. చైనా అప్పుడే ఆటమిక్ బాంబ్ ను పరీక్షించింది. దాంతో అమెరికాకు చెందిన సీఐఏ దళం.. చైనా క్షిపణులపై నిఘా పెట్టింది. ఈ మేరకు భారత్ లోని నందాదేవి పర్వతంపై అణు సాంకేతికతతో తయారు చేసిన ఓ యాంటీనాను ఏర్పాటు చేసి చైనా క్షిపణుల పరీక్షలపై నిఘా పెట్టింది. అమెరికా కు చెందిన ఆర్మీదళం సీఐఏ.. భారత ప్రభుత్వంతో కలిసి ఒక అత్యంత రహస్య మిషన్ ను అప్పట్లో ప్రారంభించింది.
ఈ మిషన్ కు భారత్ అధికారి ఎంఎస్ కోహ్లీ నాయకత్వం వహించారు. హిమాలయాల్లో ఉన్న రెండో ఎత్తయిన నందాదేవి శిఖరంపై అణు సాంకేతికతతో పనిచేసే ఒక యాంటీనాను అమర్చడమే ఆ మిషన్ లక్ష్యంగా ఉంది. అయితే మంచు తుపాను కారణంగా వారంతా ఆ పరికరాన్ని అక్కడే సేఫ్ గా పెట్టి కిందకు వచ్చేసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమెరికా ఈ మిషన్ నుంచి తప్పుకుంది. కానీ అణు పరికరం అక్కడే ఉండిపోయింది. అయితే ఆ అణు పరికరంలో ప్లూటోనియం ఉంది. కొన్నాళ్లకు అక్కడకు వెళ్లిన అధికారులకు ఎంత వెతికినా ఆ పరికరం దొరకలేదు. మంచులో కూరుకుపోయినట్లుగా భావించారు.
ఈ క్రమంలో ఇటీవల బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియా వేదికగా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవలికాలంలో గంగానది పరివాహక ప్రాంతాల్లో కేన్సర్ కేసులు అధికంగా పెరుగుతున్నాయని.. మంచు కొండలు కరిగిపోవడం.. క్లౌడ్ బరస్ట్ తదితర కారణాలకు ఆ అణు పరికరమే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఇక అణు పరికరంలోని రేడియో యాక్టివ్ పదార్థాలు వాతావరణం కలిస్తే.. తీవ్ర ప్రమాదం ఉందని.. అలాగే పవిత్రమైన గంగానది కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక ఈ రహస్య మిషన్ లో పాల్గొన్న అప్పటి అమెరికా పర్వతారోహకుడు జిమ్ మెక్ కార్తి ప్రస్తుతం 90 వ పడిలో ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటికీ తన తప్పును గుర్తుచేసుకుని ఆగ్రహిస్తున్నారు. గంగానదికి నీటిని ఇచ్చే హిమానీనదం వద్ద ప్లుటోనియం వదిలేయడంపై ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అలాగే ఈ మిషన్ ను లీడ్ చేసిన భారత్ అధికారి ఎంఎస్ కోహ్లీ సైతం.. తన చివరి రోజుల్లో ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాము ఆ మిషన్ ను అలా చేయాల్సి ఉండకూడదని చెప్పుకొచ్చారు. తాము మతిలేని పని చేశామని.. ఫూలిష్ గా వ్యవహరించామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఆ ఘటన తన లైఫ్ లో బాధాకరమైన చాప్టర్ అని తెలిపారు.












Click it and Unblock the Notifications