ప్రపంచవ్యాప్తంగా నియంతలకు కష్టకాలం-మళ్లీ పాత రూట్లోకి జనం..! సీజేపీ విశ్లేషణ..!

అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లను కాదని జనం డెమోక్రాట్లను గెలిపిస్తుండటం, అంతకు ముందు ఇజ్రాయెల్ లో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ సాధించడంలో విఫలం కావడం వంటి పరిణామాలు అంతర్జాతీయంగా మార్పుకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఇన్నాళ్లూ తాము చెప్పిందే వినాలన్న భావనలో ఉన్న పలువురు నాయకులకు తగులుతున్న ఎదురుదెబ్బలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక విశ్లేషణ చేసింది. ఆ పార్టీ నేతలు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్ ఈ మేరకు ఎక్స్ లో వేర్వేరు ట్వీట్లు చేశారు.

సీట్లోనే ట్రంప్ - అయినా అన్నీ బ్రేకులే ?- అమెరికా మధ్యంతర ఎన్నికల లెక్కేంటి?
సీట్లోనే ట్రంప్ - అయినా అన్నీ బ్రేకులే ?- అమెరికా మధ్యంతర ఎన్నికల లెక్కేంటి?

2010 తర్వాత, ప్రపంచం నియంతృత్వ రాజకీయాల పట్ల కొత్తగా ఆసక్తిని కనబరిచిందని, ప్రజాస్వామ్యం పురోగతిని మందగింపజేస్తోందని, ఒక శక్తివంతమైన నాయకుడు తమ సమస్యలన్నింటినీ పరిష్కరించగలడని ప్రజలను నమ్మించారని సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే తెలిపారు. సంస్థల కన్నా తామే గొప్పవారమని భావిస్తూ, జాతీయ వైభవాన్ని, శ్రేయస్సును, ప్రపంచ ఆధిపత్యాన్ని వాగ్దానం చేసిన నాయకులపై వారు విశ్వాసం ఉంచారని, కానీ, దానికి బదులుగా ప్రజాస్వామ్య సంస్థల పతనం, హక్కుల అణచివేత, యుద్ధాలు, ఆర్థిక అస్థిరత చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ఇటీవలి రాజకీయ ధోరణులు నియంతృత్వ రాజకీయాలపై ఉన్న ఈ విశ్వాసం ఇప్పుడు సడలడం ప్రారంభమైందని సూచిస్తున్నాయన్నారు. తాను బలవంతుడినని చెప్పుకునే ఒకే వ్యక్తి చేతిలో అధికారాన్ని కేంద్రీకరించడం వల్ల దేశం తప్పనిసరిగా బలపడదని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. వారు ఒకప్పుడు తేలికగా తీసుకున్న ప్రజాస్వామ్య స్వేచ్ఛలు, జవాబుదారీతనం, సంస్థల విలువను తిరిగి గుర్తిస్తున్నారని దిప్కే విశ్లేషించారు.

CJP Sees Global Political Shift Against Dictators Following Trump and Netanyahu Setbacks
నెతన్యాహుకు ట్రంప్ బిగ్ షాక్ - ఎన్నికల్లో ఎదురుదెబ్బతో సంచలన నిర్ణయం..!
నెతన్యాహుకు ట్రంప్ బిగ్ షాక్ - ఎన్నికల్లో ఎదురుదెబ్బతో సంచలన నిర్ణయం..!


అంతకంటే ముఖ్యంగా, జాతీయ వైభవం అంటే నిజంగా ఏమిటో వారు ప్రశ్నించడం ప్రారంభిస్తున్నారని దిప్కే తెలిపారు. ప్రపంచ ఆధిపత్య వాగ్దానాల కంటే ముందు, ప్రజలు మరింత ప్రాథమికమైన ఆర్థిక స్థిరత్వం, అందుబాటు ధరలో జీవన వ్యయం, అధికారంలో ఉన్నవారి నుండి జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నారని దిప్కే పేర్కొన్నారు. మరో సీజేపీ నేత సౌరవ్ దాస్ సైతం తాజా పరిణామాలపై స్పందించారు. నిరంకుశ ధోరణి కలిగిన ట్రంప్ పార్టీ, అమెరికా ప్రతినిధుల సభ (హౌస్), సెనేట్ రెండింటిపై తన పట్టును కోల్పోయిందని, ప్రపంచవ్యాప్తంగా నియంతలుగా మారాలని ఆశించే వారికి ఇది చాలా కష్టకాలంలా కనిపిస్తోంది, కదూ? అని ప్రశ్నించారు. అయితే గుర్తుంచుకోండి, ఎన్నికలతోనే అంతా ముగిసిపోదు. ఆ నియంతను, అతని అనుచరులను, ఆ నియంత చర్యలకు సహకరించి, ప్రోత్సహించిన ప్రతి ఒక్క వ్యక్తిని తప్పక శిక్షించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+