వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: శ్రీలంక ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. వంద మందికి పైగా ప్రయాణీకులు, ఎనిమిది మంది సిబ్బందితో కొలంబో నుంచి బయలుదేరింది.

ఈ విమానం గురువారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్‌ అయి తిరిగి బయలుదేరుతుండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రన్‌వే పైన విమానం ఆగిపోయింది. వెంటనే విమానాశ్రయ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

Close shave for passengers as Sri Lankan Airlines flight suffers hydraulic problem

దాదాపు రెండున్నర గంటల అనంతరం విమానం తిరిగి గమ్యస్థానానికి బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

కాగా, నిన్న లండన్‌కు వెళ్తున్న బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. 172 మంది ప్రయాణిస్తున్న ఈ విహంగానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. లాస్‌వెగాస్‌లోని మెక్‌కారన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పద్నాలుగు మంది ప్రయాణికులు గాయపడ్డారు. రన్‌వే పైనుంచి టేకాఫ్‌కు సిద్ధమౌతున్నప్పుడు బోయింగ్‌ 777విమానం ఎడమ ఇంజిన్‌కు మంటలు అంటుకున్నాయని అధికారులు చెప్పారు. ఆ సమయంలో 159 మంది ప్రయాణికులు, 13మంది సిబ్బంది ఆ విహంగంలో ఉన్నారని వెల్లడించారు.

English summary
More than 100 passengers of a city-bound Sri Lankan Airlines flight from Colombo had a narrow escape today when the plane developed a hydraulic problem after landing and got stuck in the runway at the airport here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X