వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణీకుడిని కాపాడేందుకు రైలునే వంచారు (ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

పెర్త్: ఓ ప్రయాణీకుడి కాలు రైలు కింద ఇరుక్కు పోవడంతో.. ఆ రైలును సిబ్బంది, ప్రయాణీకులు ఎత్తిన సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. తోటి ప్రయాణీకుడి కాలు రైలు కింద ఇరుక్కున్నదనే విషయం తెలిసిన అక్కడి సిబ్బంది, ప్రయాణీకులు వెంటనే స్పందించారు.

Commuters tilt train to free man whose leg was trapped between platform and carriage

అంతా కలిసి రైలును ఓ వైపుకు వంచారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి రైలు ఎక్కబోతూ జారిపడ్డాడు. దీంతో అతని కాలు బోగీకి, ప్లాట్ ఫాంకి మధ్యలో ఇరుక్కుపోయింది. రైలును కాస్త అటు పక్కకు వంచితే అతను కాలు లాక్కోవచ్చు. దీంతో సిబ్బంది రైలులోను ప్రయాణీకులను ఓ పక్కకు చేర్చారు. అయినా ఫలితం లేకపోయింది.

దీంతో ప్రయాణీకులు అందరు రైలు దిగి.. బోగీని పక్కకు వంచారు. దీంతో ప్రయాణీకుడు సురక్షితంగా బయట పడ్డాడు. తొలిసారి ఇలాంటి సంఘటన చూశానని, ఐకమత్యం బలం ఏమిటో, ప్రజల శక్తి ఏమిటో చూపించారని ట్రాన్స్‌పెర్త్ ప్రతినిధి ప్రశంసలు కురిపించారు.

English summary
Dozens of Australians tilted a train on Wednesday to free a commuter whose leg was trapped between a carriage and a platform, with authorities praising their efforts as an example of "people power".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X